"అవును తమ్ముడూ.. దవడ పగిలింది..! కానీ".. విజయ్ కు స్టాలిన్ పంచ్..!

గతాన్ని వదిలేస్తే.. ఈ మధ్య కాలంలో నిన్న మొన్నటివరకూ ఆదర్శంగా కనిపించిన తమిళనాడు రాజకీయాల్లో తాజాగా వ్యక్తిగత దూషణలు, విమర్శలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సీఎం విజయ్.. ఎందుకో కానీ తన రాజకీయ ప్రత్యర్ధుల్ని శత్రువుల్లా చూస్తున్నారు. వారిపై వ్యక్తిగత విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అంతే కాదు వారిని తన హావభావాలతో అనుకరిస్తూ అసెంబ్లీలోనే హేళన చేస్తున్నారు. దీనిపై సొంత కూటమిలోనే విమర్శలు వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదు. ఇదే క్రమంలో తాజాగా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ను ఉద్దేశించి విజయ్ ప్రదర్శించిన హవభావాలు విమర్శల పాలయ్యాయి. వీటిపై స్టాలిన్ ఇవాళ స్పందించారు.

అసెంబ్లీ సాక్షిగా స్టాలిన్ పై బాడీ షేమింగ్ సైగ..! క్లారిటీ ఇచ్చిన విజయ్..!
అసెంబ్లీ సాక్షిగా స్టాలిన్ పై బాడీ షేమింగ్ సైగ..! క్లారిటీ ఇచ్చిన విజయ్..!

గతంలో తనను జైల్లో వేసి కొట్టడం, దవడ పగలడాన్ని ఉద్దేశించి అసెంబ్లీలో ప్రస్తావిస్తూ సీఎం విజయ్ (CM Vijay) ప్రదర్శించిన హావభావాలపై స్టాలిన్ (MK Stalin) ఇవాళ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆయన అవును తమ్ముడూ నన్ను ఎమర్జెన్సీ కాలంలో జైల్లో వేసి దవడ పగిలేలా కొట్టారని స్టాలిన్ గుర్తుచేసుకున్నారు. 1975-77 మధ్య ఎమర్జెన్సీ సమయంలో తమిళనాడులో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దయిన సమయంలో డీఎంకే యువజన నాయకుడిగా ఉన్న తనను జైల్లో వేసి హింసించిన విషయాన్ని స్టాలిన్ గుర్తుచేసారు. అప్పటి దాడిలో తన దవడలు విరిగిపోయాయని, తనకు తగిలిన దెబ్బలు ఈ నాటికీ ఉన్నాయన్నారు. ఇందులో దాచేదేమీ లేదన్నారు.

MK Stalin Responds to Vijay s Remarks My Jaws Were Indeed Broken in Jail During Emergency
Vijay: మళ్లీ లుక్ మార్చిన విజయ్..! కూటమికి కొత్త పేరు ప్రకటన వేళ..!
Vijay: మళ్లీ లుక్ మార్చిన విజయ్..! కూటమికి కొత్త పేరు ప్రకటన వేళ..!

ప్రజా జీవితంలో ఉన్న వారికి, ముఖ్యంగా తమిళనాడు ప్రయోజనాల కోసం పోరాడిన వారికి ఇలాంటి అణచివేత ఎదురైందని స్టాలిన్ తెలిపారు. పోరాటాలు తమకు కొత్తేమీ కాదన్నారు. మీరు స్ఫూర్తిగా చెప్పుకునే అన్నాదురై కాలం చరిత్ర ఇది అన్నారు. డీఎంకే చరిత్రలో భాగమైనందుకు తనకు గర్వంగానే ఉందన్నారు. తన పోరాటం, జీవితం గురించి తెలుసుకోవాలంటూ విజయ్ కు స్టాలిన్ చురకలు అంటించారు. మీకు నిజాలు తెలియవు అంటూ స్టాలిన్ విజయ్ ను ఉద్దేశించి ఈ వీడియోలో వ్యాఖ్యానించారు. విజయ్ అసెంబ్లీలో స్టాలిన్ ను ఉద్దేశించి చేసిన సైగను బాడీ షేమింగ్ అంటూ రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలు విమర్శించిన నేపథ్యంలో ఈ వీడియో రిలీజ్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+