అసెంబ్లీ సాక్షిగా స్టాలిన్ పై బాడీ షేమింగ్ సైగ..! క్లారిటీ ఇచ్చిన విజయ్..!

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (CM Vijay)నిన్న అసెంబ్లీలో భావోద్వేగంతో కీలక ప్రసంగం చేశారు. ఇందులో ఆయన ఉపయోగించిన ఓ హావభావం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం కింద జరిగిన అరెస్టుల గురించి అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. విజయ్ చేసిన ఒక సైగపై ఇంటా, బయటా, సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఆయన ఇవాళ స్వయంగా స్పందించారు. ఈ మేరకు పోలీసు శాఖపై ఓ ట్వీట్ చేశారు.

స్టాలిన్ ఓటమిపై తేల్చేసిన మద్రాస్ హైకోర్టు..! కీలక తీర్పు..!
స్టాలిన్ ఓటమిపై తేల్చేసిన మద్రాస్ హైకోర్టు..! కీలక తీర్పు..!

అసెంబ్లీలో విజయ్ ప్రసంగిస్తూ.. "మా స్నేహితులు ప్రతిదానికీ మేము 'మీసా'ను చూశామని చెబుతుంటారు. దేనికైనా మీసాను లాగితే ఎలాగో అర్థం కావడం లేదు" అని వ్యాఖ్యానిస్తూ, తన దవడ భాగం వద్ద చేత్తో సైగ చేశారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్‌ దవడపై పోలీసులు దాడి చేయడంతో అది దెబ్బతిన్నట్లు చరిత్ర చెబుతోంది. విజయ్ చేసిన ఈ సైగ ఆ గాయాన్ని హేళన చేయడమేనని డీఎంకే మండిపడింది. విజయ్ చర్య బాధ్యతారహితంగా ఉందని, ఇది ఒక రకమైన బాడీ షేమింగ్ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం మండిపడ్డారు. చరిత్ర తెలియకుండా టీవీకే మంత్రులు ఆరోపణలు చేయడం తగదన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి సైతం విజయ్ తీరుపై మండిపడ్డారు.

Tamil Nadu CM Vijay Clarifies Unintentional Body Language During Assembly Speech
ఆమెను టచ్ చేస్తే..? అసెంబ్లీ సాక్షిగా విజయ్ బిగ్ వార్నింగ్..!
ఆమెను టచ్ చేస్తే..? అసెంబ్లీ సాక్షిగా విజయ్ బిగ్ వార్నింగ్..!

దీనిపై విజయ్ ఇవాళ ఎక్స్ లో స్పందించారు. నిన్న అసెంబ్లీలో పోలీసు శాఖకు సంబంధించిన నిధుల అభ్యర్థనపై తన సమాధాన ప్రసంగం సందర్భంగా.. మధ్యలో అసంకల్పితంగా వ్యక్తమైన తన హావభావాలు ఏమాత్రం ఉద్దేశపూర్వకమైనవి కాదని స్పష్టం చేశారు. కాబట్టి, వాటిని ఎవరి మనోభావాలనైనా వ్యక్తిగత స్థాయిలో దెబ్బతీసే ఉద్దేశంతో చేసిన చర్యగా భావించవద్దని తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు విజయ్ వెల్లడించారు. విజయ్ వివరణపై కూటమిలోని మిత్రపక్షాలతో పాటు విపక్ష డీఎంకే సంతృప్తి చెందుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+