మోదీ విమానం చుట్టూ సౌదీ జెట్ ఫైటర్లు- అరుదైన స్వాగతం

PM Modi Saudi Arabia visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ ఉదయం ప్రత్యేక విమానంలో సౌదీకి బయలుదేరారు. రెండు రోజుల పాటు అక్కడ పర్యటిస్తారు. ఆ దేశ ప్రధానమంత్రి క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన చేపట్టారు. ఇంకాస్సేపట్లో జెడ్డాకు చేరుకుంటారు.

సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్వహించబోయే వివిధ సమావేశాలు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు మోదీ. ఆ దేశంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య, వాణిజ్య,ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేలా పలు ఒప్పందాలపై ఇరు దేశాల అత్యున్నత అధికారులు సంతకాలు చేయనున్నారు.

F15 fighter jets of Royal Saudi Air Force escorted PM Modi Air India One

దశాబ్ద కాలంలో ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే తన పర్యటన ముఖ్య ఉద్దేశమని మోదీ తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. సౌదీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చుకునేలా నిర్ణయాలు ఉంటాయని అన్నారు.

ఈ పర్యటన సందర్భంగా మోదీ జెడ్డాలో నివసించే భారతీయులను ప్రత్యక్షంగా కలుసుకుంటారు. వారితో ముఖాముఖి సమావేశమౌతారు. ఇండియన్ డయాస్పొరాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యల గురించి వివరిస్తారు. భారత్‌లో పెట్టుబడులకు గల అవకాశాల గురించి వివరిస్తారు.

ప్రధాని మోదీ పర్యటనపై సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ వాణిజ్యవేత్త, సీనియర్ కన్సల్టెంట్ ఇంజినీర్ హని కయాల్ మాట్లాడారు. భారత్ స్టార్టప్‌లకు కేంద్రబిందువుగా మారిందని, పెట్టుబడులు పెట్టడానికి గల ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో భారత్ నుంచి తమకు భారీ సహకారం అందుతోందని చెప్పారు.

ఇప్పటికే నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఫార్మాసూటికల్స్ వంటి అనేక రంగాల్లో భారత్‌తో కలిసి పని చేస్తోన్నామని కయాల్ వివరించారు. భారత్‌లో పలు కంపెనీలతో తమకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, కీలక- వ్యూహాత్మక రంగాల్లో కలిసి పని చేస్తోన్నామని చెప్పారు.

కాగా- ఈ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఆయన ప్రయాణిస్తోన్న ఎయిరిండియా 1.. సౌదీ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే- ఆ దేశ వైమానిక దళానికి చెందిన ఎఫ్ 15 ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్‌గా నిలిచాయి. ఆరు జెట్ ఫైటర్స్ ఎస్కార్ట్ అయ్యాయి. మోదీ విమానానికి రెండు వైపులా మూడు చొప్పున ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+