Facebook: కొత్త పేరు..కొత్త లోగో ఇదే: అదిరిందయ్యా జుకర్‌బర్గ్: ఇక వర్చువల్ రియాలిటీ..

వాషింగ్టన్: ఊహించినట్టే.. టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్.. కొత్త రూపాన్ని సంతరించుకుంది. కొత్త వెర్షన్‌లోకి మారింది. దీని మాతృసంస్థ పేరు మార్చుకొంది. కొత్త పేరుతో ఇక కార్యకలాపాలను కొనసాగించనుంది. ఫేస్‌బుక్ అనేది రెండో ప్రాధాన్యత కిందికి వెళ్లిపోయిందా పేరెంట్ కంపెనీకి. అందుకే- ఫేస్‌బుక్ స్థానంలో కొత్త పేరును పెట్టాల్సి వచ్చింది. ఈ సోషల్ మీడియా జెయింట్ ముఖ్యకార్యనిర్వహణాధికారి మార్క్ జుకర్‌బర్గ్ కొత్త పేరును ప్రకటించారు. తన ప్రయారిటీస్ ఏమిటో వివరించారు.

Recommended Video

    Facebook కొత్త వెర్షన్‌.. ఇక వర్చువల్ రియాలిటీ..! || Oneindia Telugu
     పేరు మార్పు..

    పేరు మార్పు..

    కొద్దిరోజులుగా ఫేస్‌బుక్ తరచూ వార్తల్లో ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే. టెక్నో వరల్డ్‌లో దీని చుట్టే డిబేట్స్ సాగాయి. హాట్ టాపిక్‌గా మారిందీ ప్లాట్‌ఫామ్. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. దీన్ని ఫేస్‌బుక్ మేనేజ్‌మెంట్ తోసిపుచ్చిప్పటికీ.. ఆగట్లేదు. మరింత ఊపందుకున్నాయి. ఈ నెల చివరివారంలో మార్క్ జుకర్‌బర్గ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తారంటూ చెబుతున్నారు. అవేవీ కార్యరూపాన్ని దాల్చలేదు గానీ.. పేరు మాత్రం మార్చుకుంది.

    వార్షిక సమావేశంలో..

    వార్షిక సమావేశంలో..

    అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం ఫేస్‌బుక్ యాజమాన్యం తన వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కనెక్ట్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. మార్క్ జుకర్‌బర్గ్.. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కీలక నిర్ణయాలను ప్రకటించారు. కొత్త పేరును కూడా ప్రకటించారు. తోటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, ఒకులస్, స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్స్..ఈ ప్లాట్‌ఫామ్‌లోకి చేరాయి. సోషల్ మీడియాలో మరింత బలోపేతమైంది. ఫేస్‌బుక్ వ్యాపార కార్యకలాపాల స్వరూపమే మారిపోయింది. సోషల్ మీడియాకు మించి.. అనే స్థాయికి చేరింది.

     కొత్త పేరు ఇదే..

    కొత్త పేరు ఇదే..

    దీన్ని దృష్టిలో ఉంచుకుని- అదే స్థాయిలో ప్లాట్‌ఫామ్‌ను మరింత అభివృద్ధి చేయాలని మార్క్ జుకర్‌బర్గ్ నిర్ణయించుకున్నట్లు మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. దీనికి అనుగుణంగా తన బ్రాండ్ నేమ్‌ను కూడా మార్చుకున్నట్లు స్పష్టం చేశారు. కొత్త పేరును మెటా (Meta)గా నిర్ధారించారు. దీని లోగోను ఆయన ఆవిష్కరించారు. ఇకపై తమ కంపెనీ కార్యకలాపాలన్నీ మెటా పేరు మీదే కొనసాగుతాయని తేల్చిచెప్పారు. ఈ పేరు మార్పు అనేది మాతృసంస్థకు మాత్రమే పరిమితం అవుతుందని పేర్కొన్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్.. యధాతథంగా కొనసాగుతాయని, అందులో మార్పు ఉండదని వివరించారు.

     సంఘర్షణల నుంచి పాఠాలు..

    సంఘర్షణల నుంచి పాఠాలు..

    ఫేస్‌బుక్‌ను ఏర్పాటు చేసిన తరువాత.. ఎన్నో సంఘర్షణలు, ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా సెగ్మెంట్‌ అనేక రకాల ఒత్తిళ్లు, సవాళ్లను చవి చూస్తోందని చెప్పారు. వాటన్నింటి నుంచీ పాఠాలను నేర్చుకున్నామని, దానికి అనుగుణంగా ఈ ప్లాట్‌ఫామ్‌ను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నట్లు వార్షిక సమావేశంలో చెప్పారు. ఈ మార్పుల నేపథ్యంలో పేరెంట్ కంపెనీ పేరు మార్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

     వర్చువల్ ఎన్విరాన్‌మెంట్..

    వర్చువల్ ఎన్విరాన్‌మెంట్..

    మెటా వెర్షన్‌లో ఇక ఫేస్‌బుక్ యాజమాన్యం- వర్చువల్ ఎన్విరాన్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని జుకర్‌బర్గ్ తెలిపారు. ఇంటర్‌ కనెక్టెడ్ వర్చువల్ కమ్యూనిటీస్‌కు ప్రయారిటీ ఇస్తుందని చెప్పారు. వర్క్ అండ్ ప్లే, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్స్, అగ్‌మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్, స్మార్ట్‌ఫోన్ యాప్స్..వంటి ఇతర డివైస్‌లను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. వర్చువల్ రియాలిటీలో తమ కార్యకలాపాలు కొనసాగుతాయని, అందుకే కొత్త లోగోను ఇన్ఫినిటీ అనే అర్థం వచ్చేలా డిజైన్ చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అనే ముద్ర పడుతుందని, దీన్ని చెరిపేసుకుంటుందనే అభిప్రాయాలను ఆయన నిజం చేసినట్టయింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+