ట్రాన్స్ పోర్టు రంగంలోకి ఫేస్ బుక్ ఎంటర్
వాషింగ్టన్: ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ఇప్పుడు ట్రాన్స్ పోర్టు వ్యాపార రంగంలోకి ఎంటరైంది. ఈ విషయంపై ఉబెర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫేస్ బుక్ వినియోగదారులు ఇక ముందు తమ ఫేస్ బుక్ ద్వారా నేరుగా క్యాబ్ ను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ విషయంపై ఉబెర్ నిర్వహకులు వివరాలు వెల్లడించారు. ఈ వారంలో అమెరికాలోని పలు నగరాలు, ప్రాంతాల్లో ఫేస్ బుక్ ద్వారా ట్రాన్స్ పోర్టు సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరించారు.
దీని వలన వినియోగదారులు ఉబెర్ యాప్ ను ప్రత్యేకంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, తమ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారానే నేరుగా క్యాబ్ బుక్ చేసుకోవచ్చని వివరించారు. ఈ కొత్త విధానం మొదలు పెడుతున్న సందర్బంగా ఉబెర్ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

మొదటి సారి ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వినియోగదారులకు ఫ్రీ రైడ్ (క్యాబ్ చార్జ్ ఉండదు) అవకాశం కల్పిస్తున్నామని ఫేస్ బుక్ ప్రకటించింది. ఈ విధానాన్ని త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ఫేస్ బుక్ భావిస్తోంది.
ఉబెర్ సంస్థతో పాటు ఇతర కంపెనీలతో ఈ తరహా ఒప్పందాలను కుదుర్చుకుంటామని ఫేస్ బుక్ ప్రకటించింది. వివిద రంగాల్లో ఫేస్ బుక్ వ్యాపారాలు చెయ్యడానికి సిద్దం అయ్యింది. ఇప్పటికే ఉబెర్ సంస్థ ప్రపంచంలోని 60 దేశాల్లో ట్రాన్స్ పోర్టు సేవలు నిర్వహిస్తున్నది.












Click it and Unblock the Notifications