ఫేస్‌బుక్: ఒకేరోజు 100కోట్ల మంది ఉపయోగించారు!

న్యూయార్క్: ప్రముఖ సోషల్‌ నెట్‌వర్క్ సైట్ అయిన ఫేస్‌బుక్‌ అరుదైన రికార్డు సృష్టించింది. ఒకే రోజు వందకోట్ల మంది ఆక్టివ్‌ యూజర్లను సాధించింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు.

అయితే ఇందులో ప్రతి ఒక్కరూ రోజూ తమ ఖాతాను తెరిచే అవకాశం లేదు. కొందరు ప్రతి రోజూ తెరిస్తే.. కొందరు రెండు మూడు రోజులకోసారి తెరుస్తారు. వారానికోసారి, నెలకోసారి తెరిచేవారూ ఉన్నారు.

ఎంతమంది ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌ యూజర్లుగా ఉన్నారనే విషయం తెలుసుకునేందుకు ఫేస్‌బుక్‌ యాజమాన్యం ప్రతినెలా సగటు ఫేస్‌బుక్‌ ఆక్టివ్‌ యూజర్ల సంఖ్యను విడుదల చేస్తుంది.

Facebook has a billion users in a single day, says Mark Zuckerberg

కాగా, గత సోమవారం మాత్రం ఒకే రోజు 100 కోట్ల మంది ఫేస్‌బుక్‌లో ఆక్టివ్‌గా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. అంతమంది ఒకేరోజు యాక్టివ్‌గా ఉండటం ఫేస్‌బుక్‌ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం.

ప్రపంచ జనాభాలో ప్రతి ఏడు మందిలో ఒకరు ఫేస్‌బుక్‌ వినియోగించిన రోజు సోమవారమని సంస్థ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+