గర్ల్ ఫ్రెండ్ ఫోటోకు లైక్ కొట్టి.. జైళ్లో పడ్డ యువకుడు

అమెరికా : 'నిద్రలోను లైకులు కామెంట్ల గురించే కలవరింతలు..' సోషల్ మీడియా ఎంట్రీ నేటి యువతపై ఎంతలా ప్రభావితం చేసిందో చెప్పడానికి ఈ మాట సరిగ్గా సరిపోతుంది. ఆధార్ కార్డ్ కంటే సోషల్ మీడియా ఉనికే ఈరోజుల్లో అత్యంత పవర్ ఫుల్ అన్న మాటలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క గంటపాటు ఫేస్ బుక్ చూడకపోతే.. విలవిల్లాడిపోయే జనాలు చాలామందే ఉన్నారు.

అలాంటి వ్యక్తుల్లో అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన పాల్ మైడా ఒకరు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ.. అతగాడు ఫేస్ బుక్ లోకి తొంగిచూశాడు. ఇంకేముంది ఉన్న బెయిల్ కాస్త రద్దయిపోయి ప్రస్తుతం జైళ్లో కూర్చున్నాడు.

Facebook ‘like’ gets Florida man a return trip to jail

ఇంతకీ అసలు విషయమేంటంటే.. 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారణమయ్యాడు పాల్ మైడా. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి పరారవడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రిమాండ్ పూర్తయ్యాక మైడాకు బెయిల్ లభించింది. అయితే అది షరతులతో కూడిన బెయిల్ కావడంతో.. మొత్తం కేసు విచారణ పూర్తయ్యేవరకు మైడా ఇంటి గడప దాటవద్దు, సాక్ష్యులతో మాట్లాడవద్దు అన్నది కోర్టు విధించిన షరతులు.

అయితే మైడా మాత్రం నిబంధనలను అతిక్రమించాడు. ఇదే కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న తన ప్రేయసి బియాన్స ఫిచెల్ ఫోటోకు ఫేస్ బుక్ లో లైక్ కొట్టడమే మైడా చేసిన తప్పు. సాక్ష్యులతో మాట్లాడవద్దన్న నిబంధనలను అతిక్రమించడంతో.. బెయిల్ ను రద్దు చేసి విచారణ పూర్తయ్యేవరకు జైలు నుంచి విడుదల చేయవద్దని పోలీసులకు హుకుం జారీ చేసింది కోర్టు.

దీంతో.. మైడా పరిస్థితిని చూసి జాలిపడాలో, నవ్వుకోవాలో తెలియని స్థితి. మొత్తానికి ఫేస్ బుక్ తో ఇలా అడ్డంగా బుక్కయిపోయాడు మైడా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+