జుకర్‌బర్గ్ తోపాటు 2మిలియన్ల యూజర్లను చంపేసిన ఫేస్‌బుక్!
శాన్‌ఫ్రాన్సిస్‌కో: ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల మందికిపైగా యూజర్లను కలిగి ఉన్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ భయంకరమైన తప్పు చేసింది. అదంటేంటే.. ఏకంగా మిలియన్ల మంది యూజర్లు బతికుండగానే చనిపోయినట్లు తప్పుగా ప్రకటించింది ఫేస్‌బుక్. అంతేగాక, ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ను కూడా చనిపోయిన వారి జాబితాలో చేర్చింది.
దీంతో యూజర్లందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, జుకర్‌బర్గ్ కూడా చనిపోయారని ఆయన మెమోరియల్ ప్రొఫైల్‌ను పోస్ట్ చేసిన ఫేస్‌బుక్ తర్వాత తన ఘోరమైన తప్పిదాన్ని వెంటనే గుర్తించింది. చాలా పెద్ద పొరపాటు చేశామంటూ తర్వాత అందరికీ క్షమాపణలు చెప్పింది.

అంతేగాక, తమది చాలా భయంకరమైన తప్పిదమని సంస్థ పేర్కొంది. దాదాపు ఇరవై లక్షల మంది స్మారక ప్రొఫైల్స్‌ను ఫేస్‌బుక్ పోస్ట్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. పొరపాటును గమనించిన ఫేస్‌బుక్ వెంటనే స్పందించింది. తప్పును తక్షణమే సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది.
అలాగే జరిగిన పొరపాటుకు వినియోగదారులను క్షమాపణలు కోరింది. ఫేస్‌బుక్ చర్యపై పలువురు వినియోగదారులు ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తంచేయడం గమనార్హం.ఫేస్‌బుక్‌డెడ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో చేస్తున్న కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కాగా, ఇప్పటికే జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పిన ఫేస్‌బుక్.. వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తుంటామని పేర్కొంది.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications