భర్త గురించి పబ్లిగ్గా... ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటర్ షెరిల్ శాండ్ భర్గ్
కాలిఫోర్నియా: ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్‍బర్గ్ మంగళవారం నాడు తన భర్త డేవిడ్ గోల్డ్ బర్గ్‌కు నివాళులు అర్పించారు. గత వారం డేవిడ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె నిన్న సిలికాన్ వ్యాలీ మెమోరియల్ సర్వీస్ వద్ద వ్యక్తిగతంగా నివాళులు అర్పించారు.
మృతి నేపథ్యంలో.. స్టాన్‌ఫోర్ట్ విశ్వవిద్యాలయంలో డేవిడ్ గోల్డ్ బర్గ్ మెమోరియల్ సభ జరిగింది. ఇందులో టాప్ టెక్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. 1700 సీట్లతో ఉన్న ఆడిటోరియం పూర్తిగా నిండిపోయింది. డేవిడ్ గోల్డ్ బర్గ్... షెరిల్ శాండ్‌బర్గ్ భర్త. అంతేకాకుండా సర్వే మంకీ చీఫ్ ఎగ్జిక్యూటివ్.

డేవిడ్ గోల్డ్ బర్గ్ జ్ఞాపకార్థం జరిగిన సభలో షెర్లిన్ తన భర్త గురించి మాట్లాడారు. తాము తమ పదకొండేళ్ల మ్యారేజ్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేశామని, తాము ఒకరిని మరొకరం బాగా ప్రేమించుకునే వారమన్నారు. తాను ఊహించుకున్న నిజమైన పార్ట్‌నర్‌షిప్ తనకు లభించిందన్నారు.
అతను తనను చాలా అర్థం చేసుకున్నారని, తద్వారా తనకు ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారని, నిజంగా అతను తనకు చాలా మద్దతుగా నిలిచాడని, బాగా ప్రేమించే వాడని తెలిపారు. అతని జ్ఞాపకాలు ఎప్పటికీ తన వెంట ఉంటాయని చెప్పారు.












Click it and Unblock the Notifications