ఫేస్‌బుక్ ఖాతాల హ్యాక్: 29మిలియన్ యూజర్లపై ప్రభావం
శాన్‌ఫ్రాన్సిస్కో: గత నెలలో 29 మిలియన్ల మంది యూజర్ల డేటా దొంగలించబడం లేదా పరిశీలించడం జరిగిందని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఆ సైబర్ దాడిలో సుమారు 50మిలియన్ల యూజర్ల ఖాతాలపై ప్రభావం చూపిందని తెలిపింది.

ఆటోమెటిక్‌గా ఫేస్‌బుక్ లాగ్ బ్యాక్ అయ్యిందని వెల్లడించింది. ఈ సైబర్ దాడి వల్ల కొంత మంది యూజర్లపై ప్రభావం చూపిందని తెలిపింది. దీనిపై పర్యవేక్షిస్తున్నామని ఫేస్‌బుక్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ గై రోసెన్ వెల్లడించారు.
గత కొంత కాలం క్రితం కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు కూడా చాలా మంది యూజర్ల డేటాను హ్యాకర్లు దొంగలించారు. కొందరు విశ్లేషకులు ఫేస్‌బుక్ ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని సూచిస్తుండగా, మరికొందరు ఖాతాలను మూసివేస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications