10వేల యాప్స్ తొలగించిన ఫేస్‌బుక్: ఎందుకంటే..?
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తమ నెట్‌వర్క్ పరిధిలోని ప్రమాదకరమైన 10వేల యాప్స్‌ను తొలగించినట్లు వెల్లడించింది.
వినియోగదారుల అంతర్గత భద్రతకు ప్రమాదకారులు కానప్పటికీ.. వీటిలో చాలా వరకు పరీక్షల దశలోనే ఉన్నాయి.
వినియోగదారులకు పూర్తిగా అందుబాటులోకి రాని కారణంగా 400 మంది యాప్ డెవలపర్స్‌కు చెందిన 10వేల యాప్స్‌ను తొలగించినట్లు ఫేస్‌బుక్ వివరించింది. కంపెనీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. ఫేస్‌బుక్ నుంచి సేకరించిన వినియోగదారుల వివరాలను బహిర్గతం చేసిన యాప్స్‌ను పూర్తిగా తొలగించామని తెలిపింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.

వినియోగదారులకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ ఫేస్ ని కూడా తొలగించినట్లు తెలిపింది. గత ఏడాది మార్చిలో కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం సందర్భంగా దర్యాప్తు చేపట్టి ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
కేంబ్రిడ్జ్ అనలిటికా కేసులో ఫెడరల్ ట్రేడ్ కమిషన్.. ఏడాది తొలినాళ్లలో ఫేస్‌బుక్‌కు 5 బిలియన్ డాలర్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్ వినియోగదారుల అంతర్గత భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అలాగే తప్పుడు వార్తల ప్రచారాన్ని అడ్డుకునేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications