Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fact Check: సమాధులకు తాళం.. పాకిస్థాన్‍లో కాదు.. మన హైదరాబాద్‍లోనే..!

సమాధులకు తాళం వేసి ఉన్న ఫొటో శనివారం వైరల్‌గా మారింది. "శ్మశానంలో ఖననం చేసిన మహిళల మృతదేహాలను బయటకు తీసి అత్యాచారాలు చేస్తున్నారు. దీంతో మరణించిన మహిళల తల్లిదండ్రులు తమ కూతుళ్లు మానాన్ని కాపాడేందుకు సమాధులకు తాళాలు వేస్తున్నారు" అని ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ANI డిజిటల్ ట్విట్టర్‌లో కథనానికి లింక్‌ను ట్వీట్ చేసింది. దీంతో అనేక ప్రధాన వార్తా సంస్థలు అదే కథనాన్ని ఆన్‌లైన్‌లోకి ప్రచురించాయి. అయితే అది ఫేక్ న్యూస్ అని తేలింది.

ప్రముఖ ఫ్యాక్ట్ చెకర్ వెబ్‌సైట్ Alt News' పరిశోధనలో చిత్రంలో ఉన్న సమాధి పాకిస్థాన్‌కు చెందినది కాదని, అది భారత్ సోని హైదరాబాద్‌లో గుర్తించిందన్నారు. సమాధికి తాళం వేయడానికి కారణం వేరే కారణం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లోని మాదన్నపేట్‌లోని దారాబ్ జంగ్ కాలనీలోని మసీదు ఇ సలార్ ముల్క్ ఎదురుగా శ్మశానవాటికలో ఈ ఫొటో తీసినట్లు వివరించింది.

Locking Graves

చాలా మంది ప్రజలు స్మశానవాటికకు వెళ్లి అనుమతి లేకుండా పాత సమాధులపై మృతదేహాలను పాతిపెడుతున్నారని మస్జిద్ ఇ సలార్ ముల్క్ ముఅజ్జిన్ ముక్తార్ సాహబ్ తెలిపారు. "ఇప్పటికే ఇక్కడ ఖననం చేసిన వారి సన్నిహితులు ఫతేహాను చదవడానికి ఇక్కడికి వస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయని. ఇతరులు ఎటువంటి మృతదేహాలను పాతిపెట్టకుండా నిరోధించడానికి, కుటుంబాలు అక్కడ గ్రిల్‌ను ఉంచారు" అని పేర్కొన్నారు.

Locking Graves

ఈ సమాధి పాకిస్థాన్‌కు చెందినది అనే వాదనను ముక్తార్ ఖండించారు. గ్రిల్‌ను ప్రజలు సమాధికి ఎదురుగా ఉన్నందున దానిపై స్టాంప్ చేయకుండా నిరోధించేందుకే గ్రిల్ నిర్మించారని పేర్కొన్నారు. "పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ నివేదిక ప్రకారం, 40 శాతం కంటే ఎక్కువ మంది పాకిస్థానీ మహిళలు తమ జీవితకాలంలో ఒక్కసారైనా హింసను ఎదుర్కొంటున్నారు. ఆ దేశంలో ప్రతి రెండు గంటలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది. అలాగే గత కొంత కాలంగా శ్మశానంలో ఖననం చేసిన మహిళల మృతదేహాలపై అత్యాచారాలు జరుగుతున్నాయని" చాలా సంస్థలు కథనాలు రాశాయి. దీనపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+