ఐఎస్ఐఎస్ మహిళా ఉగ్రవాదికి భారత్ పై కన్ను !

న్యూయార్క్: కాలిఫోర్నియాలో కాల్పులు జరిపిన ఘటనలో భద్రతా దళాల చేతిలో అంతం అయిన పాకిస్థాన్ మహిళ తప్ఫీన్ మాలిక్ (27) ఒక సారి భారత్ కు వచ్చిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

భారత్ మీద ఆమె కన్ను ఉండేదని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. రెండు సార్లు పాకిస్థాన్ నుంచి సౌదీ అరేబియా వెళ్లిందని, 2013లో సౌదీ నుంచి భారత్ వెళ్లి తరువాత భర్తతో కలిసి అమెరికా చేరుకునిందని ఆ పత్రిక వివరించింది.

ఓ సారి బ్రిటన్ లో తప్ఫీన్ మాలిక్ పర్యటించిదని వివరించింది. సౌదీ అరేబియా హోం మంత్రిత్వ శాఖ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఐఎస్ఐఎస్ మహిళా ఉగ్రవాది వివరాలు వెల్లడించింది.

Farook and his wife Tashfeen Malik killed 14 people in California

సౌదీ అరేబియా హోం మత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మన్ సౌర్ తుర్కీ మహిళా ఉగ్రవాది తప్ఫీన్ మాలిక్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 2008లో తప్ఫీన్ మాలిక్ మొదటి సారి తన తండ్రిని చూడటానికి సౌదీ చేరుకునిందని అన్నారు.

దాదాపు 9 నెలల పాటు తండ్రితో గడిపిన తప్ఫీన్ మాలిక్ మళ్లి పాక్ వెళ్లిపోయిందని వివరించారు. 2013 జూన్ 8వ తేదిన మరో సారి పాక్ నుంచి సౌదీ చేరుకునిందని, అదే సంవత్సరం అక్టోబర్ 6వ తేదిన సౌదీ నుంచి భారత్ వెళ్లిందని వివరించారు.

అయితే భారత్ లో ఎన్ని రోజులు ఉందనే విషయం తెలియడం లేదని, తరువాత భర్తతో కలిసి కాలిఫోర్నియా వెళ్లిందని ఆయన స్పష్టం చేశారు. గత వారంలో తప్ఫీన్ మాలిక్, ఆమె భర్త సయ్యద్ ఫరూక్ జరిపిన కాల్పులలో 14 మంది మరణించారు.

భద్రతా దళాలు జరిపిన కాల్పులలో దంపతులు ఇద్దరూ అంతం అయ్యారు. అయితే తప్ఫీన్ మాలిక్ భారత్ కు ఎందుకు వచ్చింది, ఇక్కడ దాడులకు ఏమైనా ప్లాన్ చేసిందా, ఆమె సన్నిహితులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని అధికారులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+