ఫాస్టెస్ట్ కెమెరా: సెకనుకు 10,000 కోట్ల ఫ్రేములు
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రేములు తీసే 2డీ కెమెరాను తీసుకు వచ్చారు. అత్యంత వేగంగా చలించే కాంతి కణాల ప్రవర్తనను కెమెరాల్లో బంధించగలమా.. అంటే బంధించగలమని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన బయోమెడికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు నిరూపించారు.
సెకనుకు 10 వేల కోట్ల ఫ్రేములు... అంటే సెకనుకు పదివేల కోట్ల ఫొటోలు.. తీసే అత్యంత అధునాతన 2డి కెమెరాను వారు తయారుచేశారు. దాని సాయంతో ప్రపంచంలోనే తొలిసారిగా వేగంగా చలిస్తున్న కాంతికణాలను చిత్రీకరించారు.

చలిస్తున్న కాంతి ఇందుకోసం వారు కంప్రెస్డ్ అలా్ట్రఫాస్ట్ ఫొటోగ్రఫీ (సీయూపీ) అనే విధానాన్ని వినియోగించారు. ఇప్పటిదాకా ఉన్న టెక్నాలజీతో సెకనుకు కోటి ఫ్రేములను మాత్రమే చిత్రీకరించగలుగుతున్నారు.
వాషింగ్టన్ వర్సిటీ పరిశోధకులు తాము రూపొందించిన పరికరంలో పలు మైక్రోస్కోపులు, టెలీస్కోపులు, లెన్స్‌లను వినియోగించి ఈ అద్భుతాన్ని సాధించగలిగారు. జీవసాంకేతిక పరిజ్ఞానంలో ఫ్లోరసెంట్ ప్రొటీన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన ఫలితాలు మున్ముందు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications