కారు కొనిస్తేనే విడాకులు అన్న భార్య.. కొడుకునే అమ్మకానికి పెట్టిన భర్త
తన నుంచి విడాకులు కావాలంటే తనకు కొత్త కారు కొనివ్వాలని షరతు విధించిందో భార్య. కారు కొనేంత డబ్బు లేకపోవడంతో తన ఐదు నెలల చిన్నారిని అమ్మకానికి పెట్టాడు ఆమె భర్త.
బీజింగ్: తన నుంచి విడాకులు కావాలంటే తనకు కొత్త కారు కొనివ్వాలని షరతు విధించిందో భార్య. కారు కొనేంత డబ్బు లేకపోవడంతో తన ఐదు నెలల చిన్నారిని అమ్మకానికి పెట్టాడు ఆమె భర్త.
చైనాలోని లిన్వి పట్టణంలో జరిగింది ఈ సంఘటన. లిన్వి పట్టణానికి చెందిన జాంగ్ కొన్ని కారణాల రీత్యా భార్య నుంచి విడాకులు తీసుకోవాలని అనుకున్నాడు. అందుకు అంగీకరించిన అతడి భార్య ఓ షరతు విధించింది.
కొత్త కారు కొనిస్తే.. విడాకులు ఇచ్చేందుకు తాను సిద్ధమంది. అయితే జంగ్ దగ్గర కారు కొనిచ్చేంత డబ్బు లేదు. ఎలాగైనా భార్య నుంచి విడాకులు తీసుకోవాలని అతడు అనుకున్నాడు.
డబ్బు కోసం తన ఐదు నెలల కుమారుడిని అమ్మకానికి పెట్టాడు. ఆన్ లైన్ లో పరిచయం అయిన ఓ వ్యక్తితో 80 వేల యువాన్లకు బేరం కూడా కుదుర్చుకున్నాడు. అతడికి చిన్నారిని అప్పగించి డబ్బు తీసుకునేందుకు ఓ కూడలి వద్ద వేచి ఉన్నాడు.

పది నిమిషాలు గడిచాయి. చలి తీవ్రంగా ఉండడం, ఒంటిపై సరైన దుస్తులు లేకపోవడంతో ఐదు నెలల పసివాడు ఏడవడం ప్రారంభించాడు. సరిగ్గా అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు జాంగ్ ను అనుమానించి పోలీసు స్టేషన్ కు తరలించి విచారణ మొదలెట్టడంతో విషయమంతా బయటికొచ్చింది.
తన భార్య నుంచి విడాకులు తీసుకావాలన్న ఉద్దేశంతో.. ఆమెకు కారు కొనిచ్చేందుకే కొడుకుని అమ్మేందుకు సిద్దమైనట్లు జాంగ్ పోలీసుల వద్ద అంగీకరించాడు. తాము విడాకులు తీసుకుంటే తమ కుమారుడు అనాథ కాకుండా తల్లిదండ్రులు ఉంటారనే ఆలోచనతో కూడా అలా చేసినట్లు అతడు చెప్పాడు.
దీంతో పోలీసులు జాంగ్ పై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కూడలిలో ఉన్న సీసీ టీవీ కెమెరాల ద్వారా ఈ ఉదంతానికి సంబంధించి రికార్డ్ అయిన దృశ్యాలను చూసిన నెటిజన్లు జాంగ్ ప్రవర్తనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications