థ్యాంక్ గాడ్! కూలిన ఎస్కలేటర్, తృటిలో బయటపడ్డ తండ్రీకొడుకులు (వీడియో)

షాంఘై: ఓ తండ్రి, కొడుకు ఎస్కలేటర్ దిగిన మరుక్షణంలోనే అది క్రాష్ అయింది. వారిద్దరు క్షణంలో వెయ్యో వంతులో ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న వారు అమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు.

సమాచారం మేరకు ఈ వీడియో చైనాలోని క్షాంచెంగ్‌లోని ఓ మాల్‌కు చెందినది. ఈ ఫుటేజీ సీసీటీవీ కెమెరాలో బంధించినదిగా భావిస్తున్నారు. తొలుత తనయుడు ఎస్కలేటర్ నుంచి కాలు ఫ్లోర్ పైన పెట్టగా, ఆ తర్వాత తండ్రి కూడా ఫ్లోర్ పైన అడుగు పెట్టాడు.

Father, Son Step Off Escalator Just Before It Crashes. Watch Narrow Save

వారు అలా ఫ్లోర్ పైన అడుగు పెట్టారో లేదో ఎస్కలేటర్ కూలిపోయింది. ఇది ఒళ్లు గగుర్బొడిచే విధంగా ఉంది. ఎస్కలేటర్ పూర్తిగా క్రాష్ అయింది. అది గమనించిన ఆ తండ్రీ కొడుకులు అక్కడి నుంచి వెంటనే మరింత ముందుకు వెళ్లిపోయారు. ఆ ఎస్కలేటర్ క్రాష్ అయి అక్కడ హోల్‌లా ఏర్పడింది.

ఆ ఎస్కలేటర్ పైన కిందివైపు ఓ వ్యక్తి ఉన్నాడు. ఎస్కలేటర్ క్రాష్ అవుతుండగా అప్రమత్తం చేసేందుకు అతను అరిచాడు. ఈ సంఘటన జూలై 28వ తేదీన చోటు చేసుకుంది.

క్షాంచెంగ్ మార్కెట్ సూపర్‌వైజర్ బ్యూరో ఆ తర్వాత దానిని పర్యవేక్షించారు. ఎస్కలేటర్ క్రాష్ కావడానికి గల కారణాలు వెల్లడించారు. తృటిలో ప్రాణాల నుంచి బయటపడటంపై సోషల్ మీడియాలో యూజర్లు స్పందిస్తున్నారు. వావ్.. అద్భుతం, తండ్రీ కొడుకులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.. థ్యాంక్ గాడ్ అని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+