బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్‌కు కండోమ్స్ చోరీ: కూతురి హత్య
హైదరాబాద్: తన బాయ్‌ఫ్రెండ్‌తో శృంగార క్రీడ కోసం కండోమ్ దొంగిలించిందన్న కన్నకూతురును తండ్రి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. పాకిస్థాన్ దేశానికి చెందిన అసదుల్లా ఖాన్ (51), షాజియా(41) అనే దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరంతా కలిసి జర్మనీలో నివసిస్తున్నారు.
ఖాన్ రెండో కూతురి పేరు లరీబ్. ఈమెకు జర్మనీ దేశానికి ముస్లిం యువకుడు రహీల్ అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఓ రోజున ఖాన్ ఇంటికి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఓ లేఖ వచ్చింది. అందులో లరీబ్ హ్యాండ్ బ్యాగు నుంచి కండోమ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు ఉంది. దీంతో ఖాన్, షాజియాలకు అనుమానం వచ్చింది.
తమ కూతురు లైంగిక సంబంధాలు కలిగివున్నట్టు నిర్ధారించుకున్నారు. కుమార్తె చేసిన చర్య వల్ల తమ పరువు పోయేలా ఉందని భావించాడు. దాంతో అసదుల్లా ఖాన్ కూతురిని కర్కశంగా కొట్టి చంపేశాడు. ఈ చర్యను భార్య షాజియా కూడా సమర్థించడం గమనార్హం. పైగా తన భర్త అలా చేయడానికి గల కారణాలను కూడా వివరించింది.

'లరీబ్ తన ఇష్టం వచ్చినట్లు ఉండేది. ప్రవర్తించేది. ఆమె చాలా సార్లు రాత్రిళ్లు ఇంటికి కూడా వచ్చేది కాదు. పైగా స్కార్ఫ్ కూడా వేసుకునేది కాదు. ఒకరోజు పోలీసుల నుంచి ఓ లెటర్ వచ్చింది. అందులో లరీబ్ కండోమ్స్ దొంగలిస్తూ పట్టుబడిందని ఉంది. దీంతో లరీబ్ లైంగికంగా సంబంధాలు కలిగి ఉందని తెలిసింది. దీన్ని చూసిన నా భర్త లరీబ్‌ని హత్యచేశాడు' అని చెప్పుకొచ్చింది.
అయితే, లరీబ్ పెద్ద సోదరి, బాయ్‌ఫ్రెండ్ వాదన మాత్రం మరోలా ఉంది. 'మా అమ్మ ఎప్పుడూ సరిగా చూసుకోలేదు. ఆమె ఇష్టం వచ్చినట్లు కర్రతో కొట్టేది. మా నాన్న కూడా లరీబ్ భాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడనివ్వడు. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసేవాడు.' అని చెప్పింది.
లరీబ్ బాయ్ ఫ్రెండ్ రహీల్ కూడా ఖాన్, షాజియా ఇద్దరూ లరీబ్‌ని బాగా వేధించేవారని, కొట్టేవారని బోరున విలపిస్తూ చెప్పాడు. కాగా, గత జనవరి 28వ తేదీన లరీబ్‌ను హత్య చేసి అసదుల్లా ఖాన్‌తో పాటు ఆయనకు సహకరించిన భార్య షాజియాను జర్మనీ పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications