వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్ షాకింగ్: అందంగా ఉంటే మళ్లీ రేప్ చేస్తారని..

|
Google Oneindia TeluguNews

ఇరాక్: ఇస్లామిస్ స్టేట్ ఉగ్రవాదుల (ఐసిస్) ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. వారి చేతిలో అత్యాచారానికి గురైన ఓ మహిళ తనను మళ్లీ ఎక్కడ వారు బలాత్కారం చేస్తారేమోనని భయపడి తనను తాను కాల్చుకొని అందవిహీనంగా తయారు చేసుకున్న షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.

ఈ సంఘటన ఇరాక్‌లో జరిగింది. ఐసిస్ ఉగ్రవాదుల చేతుల్లోఎంతోమంది అమ్మాయిల బలవుతున్నారు. యాజ్దీ తెగకు చెందిన పదిహేడేళ్ల యాస్మిన్‌ ఇరాక్‌లోని శరణార్థుల శిబిరంలో రెండు వారాలుగా ఉంటోంది. ఓ రోజు ఈ అమ్మాయి తన శిబిరం బయట ఉగ్రవాదుల అరుపులు వినిపిస్తున్నట్లుగా భావించింది.

Fearing Rape Again By ISIS, She Burnt Herself To Become 'Undesirable'

దీంతో మళ్లీ తనను అపహరించడానికి వచ్చారేమోనని భయపడి శరీరానికి నిప్పంటించుకుంది. తాను అందగా ఉంటే తనను తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేస్తారని, అందవిహీనంగా తయారైతే తనను తీసుకెళ్లరని ఆమె భావించి ఇలా చేయడం షాకింగ్‌కు గురి చేసే అంశం.

శరీరమంతా కాలిపోయిన ఆమెను జర్మనీకి చెందిన ఓ వైద్యుడు గుర్తించి సాయమందించాడు. ఇది గత ఏడాది జరిగింది. ప్రస్తుతం యాస్మిన్‌ కోలుకుంటోంది. తనలాగా ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్న మరో 1.100 మంది మహిళలతో కలిసి జర్మనీలో మానసిక చికిత్స పొందుతోంది.

English summary
The Yazidi girl had been in the safety of a refugee camp in Iraq for two weeks when she imagined she heard the voices of Islamic State fighters outside her tent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X