అగ్ని ప్రమాదం: చిన్నారిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
న్యూయార్క్: అగ్ని ప్రమాదంలో చిక్కుకొన్న చిన్నారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది చేసిన సాహసం పలువురి ప్రసంశలు పొందుతోంది. చిన్న పొరపాటు జరిగిన చిన్నారి ప్రాణాలు పోతాయి. అయితే కానీ అతి జాగ్రత్తగా చిన్నారిని ఒడిసిపట్టుకొని ప్రాణాలు కాపాడిన అగ్ని మాపక సిబ్బందిని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకొంది.
అమెరికాలోని జార్జియాలో జనవరి 3న భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వైపు అగ్నికీలలను అదుపు చేస్తూనే మరో వైపు మంటల్లో ఇరుక్కున్న వారిని రక్షించడానికి సహాయకచర్యలు ముమ్మరం చేశారు. ఓ డజను మంది బిల్డింగ్ పై నుంచి కిందకు దిగడానికి సిద్దంగా ఉన్నారు. సరిగ్గా అదేసమయంలో మంటల తీవ్రత ఎక్కువవ్వడంతో పై నుంచి దిగుతున్న వ్యక్తి ఓ చిన్నారిని కిందకు విసిరారు. వెంటనే అప్రమత్తమైన కెప్టెన్ స్కాట్ స్ట్రాప్ చిన్నారిని తన రెండు చేతులతో పట్టుకొన్నారు.

ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. వీడియో చూసిన అనంతరం అగ్నిమాపక సిబ్బంది ధైర్య సాహసాలను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు.
కొన్ని సందర్భాల్లో ఫుట్ బాల్‌ను క్యాచ్ పట్టుకున్నట్టు చిన్నారులను పట్టుకోవాల్సి వస్తుందని చెప్పారు ఫైర్ సిబ్బంది. జార్జియాలో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారితో పాటూ 12 మంది ప్రాణాలను కాపాడగలిగామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.












Click it and Unblock the Notifications