తాగుతూనే కారు నడిపాడు.. ఎన్నిసార్లు అరెస్టు చేసినా ఇదే తంతు!

అక్కడి ఓ బడా వ్యాపారవెత్తకు ఇతను మేనల్లుడని, అందువల్లే అతన్ని పోలీసులు సైతం ఏం చేయలేకపోతున్నారని పత్రికలు వాపోతున్నాయి.

రబాట్: ఇండియాలోనే కాదు.. ఏ దేశంలోనైనా బడా బాబుల కుమారుల విచ్చలవిడితనానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది. ముఖ్యంగా అర్థరాత్రి పూట పీకలదాకా తాగి రోడ్డుమీదకెక్కి ప్రాణాలు పోగోట్టుకుంటున్న ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం.

తాజాగా మొరాకో రాజధాని రబాటాలో ఓ బడా బాబు కుమారుడు.. ఏకంగా తన 'డ్రంకన్ డ్రైవ్'ను వీడియో రూపంలో చిత్రీకరించి మరీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియోలో అతను మద్యం సేవిస్తూ కారు నడుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 20ఏళ్ల ఈ యువకుడు తన ఫెరారీ కారులోనే మందు దుకాణం తెరిచి.. అతివేగంతో రోడ్ల మీద చక్కర్లు కొట్టడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు.

Ferrari rampage video lands Morocco 'rich kid' in jail

రాత్రిపూట నైట్ క్లబ్ ల వెంట తిరగడం, పీకలదాకా తాగడం, ఆపై కారుతో రోడ్డెక్కడం గత కొన్నాళ్లుగా ఇతగాడి దినచర్యగా తెలుస్తోంది. మత్తులో తూలిపోతున్నా సరే.. పెగ్గు మీద పెగ్గు వేస్తూ కారును పరుగులు పెట్టిస్తున్నాడు. ఇదే వీడియోలో అతని కారు యాక్సిడెంట్ కు గురైన దృశ్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రశ్నించిన పోలీసులనే బెదరగొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆఖరికి అంబులెన్స్ లో ఎక్కించినా.. అందులోను సిగరెట్ తాగుతూ తన దర్జా ఒలకబోశాడు. ఎన్నిసార్లు అరెస్టు చేసినా.. ఇతగాడిది ఇదే తీరు అంటూ మొరాకోలోని పత్రికలు రాస్తున్నాయి. అక్కడి ఓ బడా వ్యాపారవెత్తకు ఇతను మేనల్లుడని, అందువల్లే అతన్ని పోలీసులు సైతం ఏం చేయలేకపోతున్నారని పత్రికలు వాపోతున్నాయి.

తాజాగా బుధవారం నాడు మరోసారి మద్యం తాగుతూ పట్టుబడటంతో అతనికి రూ.1.4లక్షల దాకా జరిమానా విధించారు. అతని కారుకు ఇన్సూరెన్స్ కూడా లేదని పోలీసులు గుర్తించడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+