దివంగత క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో కుమారుడు ఆత్మహత్య
హవానా: దివంగత క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పెద్ద కుమారుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వయస్సు 68 ఏళ్లు. అతని పేరు ఫిడేల్ క్యాస్ట్రో డియాజ్ బాలార్ట్.
ఇతను గత కొన్నాళ్లుగా పూర్తి నిరాశలో కూరుకుపోయారు. గత కొన్ని నెలలుగా వైద్యుల బృందం అతనికి చికిత్స అందిస్తోంది. గురువారం ఉదయం అతను ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక పత్రికలు వెల్లడించాయి.

ఇతను 1949 సెప్టెంబర్ 1వ తేదీన జన్మించాడు. మీర్తా డియాజ్ బాలార్ట్‌ను వివాహం చేసుకున్నాడు. క్యూబా ప్రభుత్వం సైంటిఫిక్ సలహాదారుగా ఉన్న ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. క్యూబా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications