అమెరికా అంతం దగ్గర పడింది.. ఇదే నా ఫైనల్ వార్నింగ్: కిమ్ జాంగ్ ఉన్
అమెరికా-ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతలు ఇంకా సడలలేదు. ఇరు దేశాధినేతలు తీవ్రమైన పదజాలంతో పరస్పరం రెచ్చగొట్టుకుంటూనే ఉన్నారు.
ప్యాంగ్ యాంగ్: అమెరికా-ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతలు ఇంకా సడలలేదు. ఇరు దేశాధినేతలు తీవ్రమైన పదజాలంతో పరస్పరం రెచ్చగొట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అమెరికాకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నానని హెచ్చరికలు జారీ చేశారు.
అణుబాంబు ప్రయోగిస్తే ఉత్తరకొరియా సర్వనాశనమవుతుందని అమెరికా రక్షణ ప్రతినిధి ప్రకటించిన వెంటనే కిమ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. 'క్లైమాక్స్' దగ్గరపడిందని వ్యాఖ్యానించారు.

అమెరికా విచారకరమైన వైఫల్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అంతం దగ్గరపడిందని, ఇదే ఫైనల్ వార్నింగ్ అని ఆయన స్పష్టం చేశారు.
అదే సమయంలో దక్షిణకొరియాపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా చెప్పినట్టల్లా దక్షిణకొరియా ఆడుతోందని వ్యాఖ్యానించారు. దీంతో ఏ క్షణంలో ఏంజరుగుతుందోనని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications