లండన్ వ్యాన్ దాడిలో షాకింగ్ నిజాలు: ముస్లింలను చంపేస్తానంటూ అతివేగంతో!..

Subscribe to Oneindia Telugu

లండన్: సెవెన్ సిస్టర్స్ రోడ్డులో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన వ్యాను దాడికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. సమీపంలోని ముస్లిం ప్రార్థన మందిరాన్ని టార్గెట్ గా చేసుకుని దుండగులు వ్యాన్ దాడికి తెగబడినట్లుగా ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.

మళ్లీ ఉలిక్కిపడ్డ లండన్: సెవెన్ సిస్టర్స్ రోడ్డులో భీభత్సం.. పాదచారుల పైకి దూసుకెళ్లిన వ్యాన్

'నేను ముస్లింలందరిని చంపేస్తాను' అంటూ సదరు వ్యాన్ డ్రైవర్ గట్టిగా అరిచాడని అబ్దుల్ రహ్మాన్ శాలే అలామౌడీ అనే వ్యక్తి తాజాగా పోలీసులకు తెలిపాడు. సమీపంలోని మసీదులో ముస్లింలు ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో.. సదరు డ్రైవర్ అతివేగంతో అటువైపు దూసుకెళ్లాడు. అడ్డొచ్చిన వారిని వ్యానుతో ఢీకొట్టాడు. మసీదు చిన్నది కావడంతో పలువురు ముస్లింలు దాని బయటే ప్రార్థనలు జరిపారు. దీంతో వారిని టార్గెట్ చేసుకుని దుండగుడు ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు.

Finsbury Park mosque attack: Man shouted 'I'm going to kill all Muslims' after suspected london terror attack

క్షణాల వ్యవధిలో ఇదంతా జరిగిపోయిందని, తాను తన స్నేహితులు కలిసి వ్యాను దాడిలో గాయపడిన ఓ వృద్దుడిని రక్షించేందుకు ప్రయత్నించామని అబ్దుల్ చెప్పాడు. 12.20గం. సమయంలో ఈ ఘటన జరిగిందని, మొత్తం 10మంది దాకా గాయపడి ఉండవచ్చునని పేర్కొన్నాడు.

వ్యాను దాడికి పాల్పడిన వ్యక్తిని తాము పట్టుకునేందుకు ప్రయత్నించామని.. ఆ సమయంలో 'నేను ముస్లింలందరిని చంపేస్తా' అంటూ అతను అరిచాడని అబ్దుల్ తెలిపాడు. చివరికి అతన్ని పట్టుకుని పోలీసులు వచ్చేంతవరకు పారిపోకుండా ఆపగలిగామని చెప్పాడు. బాధితులంతా హాహాకారాలు చేశారని, అంబులెన్స్.. పోలీస్.. అంటూ గట్టిగా కేకలు వేశారని వివరించాడు.

మొన్నటి లండన్ బ్రిడ్జి దాడి లాగే ఇది కూడా జాత్యహంకార దాడే అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కాగా, తాజా దాడిలో మృతి చెందగా..పలువురు గాయాలపాలైనట్లు తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Witnesses to the suspected Finsbury Park terrorist attack claim a man shouted “I'm going to kill all Muslims” after a van ploughed into people near the area's mosque.
Please Wait while comments are loading...