భారత్ కు రుణపడి ఉంటాం.. చైనా సంచలన పోస్టు.. కారణం ఇదే..?
చైనాతో భారత్ కు సరిహద్దు వివాదం కొనసాగుతూ వస్తోంది. ఇరు దేశాల మధ్య చాలాసార్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చైనా ఎప్పుడూ భారత్ ఓటమినే ఆకాంక్షిస్తుంది. ఇటీవల భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ కు ఆయుధాలను సరఫరా చేసి వక్ర బుద్ధిని చాటుకుంది. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ ను భారత్ అడ్డుపడుతోందని మనదేశంపై చైనా పగ పెంచుకుంటోంది. ఈ క్రమంలో భారత్ కు చైనా కృతజ్ఞతలు చెప్పింది. కారణం ఏంటో తెలుసా..?
ఆపదలో ఉన్న ప్రపంచ దేశాలకు సాయం చేయడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుంది. అయితే మరోసారి మంచి మనసును చాటుకుంది భారత్. రెండు రోజుల క్రితం కేరళ వద్ద ప్రమాదానికి గురైన చైనాకు చెందిన ఓడను భారత నేవీ బృందం రక్షించింది. ప్రమాదం జరిగిన సమయంలో షిప్ లో 22 మంది ఉన్నారు. వారిలో 14 మంది చైనీయులు కాగా వీరిలో ఆరుగురు తైవాన్ ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. మరో నలుగురు మిస్సింగ్ అయినట్లు సమాచారం అందుతోంది.

కేరళ తీరం సమీపంలోని అరేబియా సముద్రంలో జూన్ 9 చైనాకు చెందిన ఎంవీ వాన్ హాయ్ 503 అనే సరకు రవాణా నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. చుట్టూ నీళ్లు.. నరమానవుడు కనిపించక అందులోని సిబ్బంది భయబ్రాంతులకు లోనయ్యారు. ఆర్తనాదాలు పెట్టారు. అయితే వారిని భారత నేవీ సిబ్బంది రక్షించింది. నౌకలో మొత్తం 22 మంది ఉండగా.. అందులో 14 మంది చైనా దేశస్థులు కాగా వీరిలో ఆరుగురు తైవాన్ ప్రాంతానికి చెందినవారు. మరో నలుగురు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిని గాలిస్తున్నారు.
On June 9, MV Wan Hai 503 encountered onboard explosion and fire 44 nautical miles off Azhikkal, Kerala. Of the total 22 crew members on board, 14 are Chinese, including 6 from Taiwan. Our gratitude goes to the Indian Navy @indiannavy and the Mumbai Coast Guard for their prompt… https://t.co/3V8vr1xVW9
— Yu Jing (@ChinaSpox_India) June 10, 2025
అయితే ఈ ఘటనపై చైనా ప్రభుత్వం స్పందించింది. భారత నేవీపై ప్రశంసలు కురిపించింది. భారత్ కు రుణపడి ఉంటామని పేర్కొంది. నౌకలోని సిబ్బందిని కాపాడినందుకు ఇండియన్ కోస్ట్ గార్డుకు కృతజ్ఞతలు తెలిపింది. నౌకలో మొత్తం 22 మంది సిబ్బంది ఉండగా.. నలుగురు అదృశ్యం అయ్యారు.. ఐదుగురు గాయపడ్డారు. 18 మందిని భారత నేవీ కాపాడిందని చైనా పేర్కొంది. మిస్సింగ్ అయిన వారికోసం రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications