ప్రసిద్ధ దుబాయ్ మెరైన్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం(వీడియో)
దుబాయ్: ప్రపంచంలోనే ఎత్తైన భవనాల్లో ఒకటైన దుబాయ్‌లోని మెరైన్ టార్చ్ భవంతిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్‌లోని ప్రసిద్ధ పర్యాటక స్థలాల్లో ఒకటైన ఈ 79 అంతస్తుల టార్చ్ టవర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కొద్దిసేపటికే సగానికిపైగా భవనం మంటల్లో కాలిపోయింది. పార్కింగ్‌లో ఉన్న పలు వాహనాలు కాలిపోయాయి ఈ ప్రమాదంలో కొందరు స్వల్ప గాయాలకు గురయ్యారని, మిగితా వారంతా క్షేమంగా బయటపడ్డారని దుబాయ్ మీడియా వెల్లడించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికిచేరుకుని మంటలు ఆర్పివేసింది.
ఈ భవనంలో పెద్ద హోటల్స్ ఉండటంతో పర్యాటకులు ఎక్కువగా ఇక్కడే బస చేసేందుకు ఆసక్తి చూపుతారు. కాగా, స్థానికులు ఈ దృశ్యాలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. 2015లో కూడా ఈ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. అప్పుడు కూడా భవనంలోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు.












Click it and Unblock the Notifications