అమెజాన్ అడవులు కాలిపోతున్నాయి.. ఆక్సిజన్‌పై ఆందోళన.. యాక్టర్ మహేశ్ బాబు విచారం (VIDEO)
Recommended Video
బ్రెజిల్ : అమెజాన్ అడవులు కాలి బూడిదవుతున్నాయి. దాదాపు పదిహేను రోజులకు పైగా మంటలు వ్యాపిస్తుండటంతో అడవి దగ్థం అవుతోందనే వార్తలొస్తున్నాయి. వేలాది హెక్టార్లలో విస్తరించిన చెట్లు అగ్ని ధాటికి మండిపోతున్నాయి. ఆ క్రమంలో దక్షిణ అమెరికా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో పొగ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే అమెజాన్‌లో దాదాపు 73 వేల అగ్ని ప్రమాదాలు సంభవించాయని బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐఎన్‌పీఈ వెల్లడించింది. గడచిన ఐదేళ్లలో అగ్నిప్రమాదాల సంఖ్య 83 శాతం పెరిగడం గమనార్హం.

మంటల్లో అమెజాన్ అడవులు.. మానవాళికి 20 శాతం ఆక్సిజన్ అక్కడిదే..!
గత కొన్నాళ్లుగా అమెజాన్ అడవుల్లో మంటల ధాటికి చెట్లు కాలి బూడిదవుతున్నాయి. మానవ తప్పిదాలు కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయనేది పర్యావరణవేత్తలు చెబుతున్న మాట. అడవుల్లో చెట్లను ఇష్టారాజ్యంగా కొట్టేయడం కూడా ప్రమాద తీవ్రతను మరింత పెంచుతోందనే ఆరోపణలున్నాయి. ఇప్పటి సీజన్‌లో అధిక ఉష్ణోగ్రతతో పాటు తక్కువ స్థాయిలో ఉండే ఆర్థ్రత కారణంగా అడవిలో మంటలు సాధారణమే అయినప్పటికీ.. ఇటీవల తరచుగా అగ్ని ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగించే పరిణామమే.
అమెజాన్ అడవుల్లో రికార్డ్ స్థాయి మంటలు చెలరేగాయనే దానికి నిదర్శనంగా నాసా శాటిలైట్ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 శాతం ఆక్సిజన్ అందించడానికి ఆధారంగా నిలుస్తున్న అమెజాన్ అడవులు ఇప్పుడు కాలి బూడిద అవుతుండటం భయాందోళనకు గురి చేస్తోంది.
నాసా శాటిలైట్ ఫోటో.. పర్యావేరణవేత్తల ఆందోళన..!
భూగోళానికి అధిక స్థాయిలో ప్రాణవాయువును అందించే అమెజాన్ అడవులు ఇలా కాలి బూడిద అవుతుండటాన్ని చూసి పర్యావేరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సౌత్ అమెరికా బ్రెజిల్ ప్రాంతంలోని ఈ అడవులు ప్రతి యేటా రికార్డు స్థాయిలో దగ్ధం అవుతుండటం ప్రాణ వాయువుపై భయాందోళన పుట్టిస్తోంది. నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఫర్ స్పేస్ రీసర్చ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక కూడా ఇదే విషయం తేటతెల్లం చేస్తోంది. అమెజాన్ అడవుల్లో చెట్లను నరికివేయడం ఎక్కువైనట్లు ఆ రిపోర్టులో పేర్కొంది. అదలావుంటే ఆ దేశాధ్యక్షుడు జెయిర్ మెస్సియాస్ బొల్సనారో ఖండించారు.
ఊపిరితిత్తుల్లాంటి అడవులు కాలిపోతుండటం బాధాకరం : ప్రిన్స్ మహేశ్ బాబు
అమెజాన్ అడవులు పెద్ద ఎత్తున కాలిపోతున్నట్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తెలుగు సినిమా నటుడు ప్రిన్స్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ వార్త నిజంగా దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్ అందిస్తున్న అమెజాన్ అడవులు కాలి బూడిద అవుతుండటం ఆందోళన కలిగించే విషయమని ట్వీట్ చేశారు. మానవ మనుగడకు కారణమైన ప్రాణ వాయువు అందించడంలో అమెజాన్ అడవుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు.
భూమండలానికి లంగ్స్ లాంటి అమెజాన్ అడవులు కాలిపోతుండటం విచారకరం. అపారమైన జీవవైవిధ్యం విలవిల్లాడుతోందని.. భూమాతను కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరం తమ వంతుగా ఏదైనా చేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని.. అలాంటి కార్యక్రమం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications