అమెరికాలో భారత విద్యార్థిపై కాల్పులు, మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ భారత సంతతి విద్యార్థి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుత్గర్స్ యూనివర్శిటీలో చదువుతున్న థామస్ రివర్ విద్యార్థి 21ఏళ్ల షానీ పటేల్ నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనలో పటేల్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలిసిందని, నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. అయితే కాల్పులు ఎందుకు జరిపారన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదు.












Click it and Unblock the Notifications