ఫస్ట్ లుక్: చిట్టి చెల్లెల్ని ముద్దాడుతున్న ప్రిన్స్ జార్జి (ఫోటోలు)

లండన్: బ్రిటిష్ రాయల్ కుటుంబానికి చెందిన పిల్లల ఫోటోలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రిన్స్ జార్జి, ప్రిన్స్ ఛార్లెట్‌లకు సంబంధించిన నాలుగు ఫోటోలను రాయల్ మోనార్కీ యొక్క అధికారిక ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా షేర్ చేశారు. ఈ ఫోటోల్లో అందంగా ఉన్న తన చెల్లెలు ప్రిన్సెస్ ఛార్లెట్‌ను ప్రిన్స్ జార్జి ముద్దాడుతున్న ఫోటో ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫోటోలను జూన్ 6 (శనివారం) నాడు కెన్సింగ్టన్ ప్యాలెస్ విడుదల చేసింది.

ఈ ఫోటోలన్నింటిని డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేట్ మిడిల్టన్ స్వయంగా తీయడం విశేషం. ప్రిన్స్ జార్చి, ప్రిన్సెస్ ఛార్లెట్ మొదటి ఫోటోను విడుదల చేయడం మాకెంతో సంతోషంగా ఉందని కెన్సింగ్టన్ ప్యాలెస్ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ప్రిన్సెస్ ఛార్లెట్ పూర్తి పేరు 'ఛార్లెట్ ఎలిజిబెత్ డయానా'. శనివారం జన్మించిన పాపను ఇక నుంచి 'ప్రిన్సెస్ ఛార్లెట్ ఆఫ్ కేంబ్రిడ్జ్' అని పిలుస్తారు.

ప్రిన్సెస్ ఛార్లెట్ సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో మే 2 (శనివారం ) జన్మించిన సంగతి తెలిసిందే. బ్రిటన్ రాజసింహాసన వారసుల్లో ఈ చిన్నారి రాజకుమారిది నాల్గవ స్ధానం. తాత ఛార్లెస్, తండ్రి విలియం, అన్న జార్జిల తర్వాత స్ధానం ప్రిన్సెస్ ఛార్లెట్‌దే కావడం విశేషం. తాత ఛార్లెస్, తాతమ్మ ఎలిజిబెత్ రాణి, నానమ్మ డయానా పేర్లను ప్రతిఫలించే విధంగా ఛార్లెట్ పేరు పెట్టారు.

ఫస్ట్ లుక్: చిట్టి చెల్లెల్ని ముద్దాడుతున్న ప్రిన్స్ జార్జి

ఫస్ట్ లుక్: చిట్టి చెల్లెల్ని ముద్దాడుతున్న ప్రిన్స్ జార్జి

ప్రిన్స్ జార్జి, ప్రిన్సెస్ ఛార్లెట్ ఫోటోలను శనివారం కెన్సింగ్టన్ ప్యాలెస్ విడుదల చేసింది. ప్రిన్స్ జార్జి చేతిలో చిట్టి చెల్లెలు ప్రిన్సెస్ ఛార్లెట్.

 ఫస్ట్ లుక్: చిట్టి చెల్లెల్ని ముద్దాడుతున్న ప్రిన్స్ జార్జి

ఫస్ట్ లుక్: చిట్టి చెల్లెల్ని ముద్దాడుతున్న ప్రిన్స్ జార్జి

ప్రిన్స్ జార్జి, ప్రిన్సెస్ ఛార్లెట్ ఫోటోలను శనివారం కెన్సింగ్టన్ ప్యాలెస్ విడుదల చేసింది. చిట్టి చెల్లెలు ప్రిన్సెస్ ఛార్లెట్‌ను ముద్దాడుతున్న ప్రిన్స్ జార్జి.

 ఫస్ట్ లుక్: చిట్టి చెల్లెల్ని ముద్దాడుతున్న ప్రిన్స్ జార్జి

ఫస్ట్ లుక్: చిట్టి చెల్లెల్ని ముద్దాడుతున్న ప్రిన్స్ జార్జి

ప్రిన్స్ జార్జి, ప్రిన్సెస్ ఛార్లెట్ ఫోటోలను శనివారం కెన్సింగ్టన్ ప్యాలెస్ విడుదల చేసింది. ఈ ఫోటోలన్నింటిని డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేట్ మిడిల్టన్ స్వయంగా తీయడం విశేషం.

 ఫస్ట్ లుక్: చిట్టి చెల్లెల్ని ముద్దాడుతున్న ప్రిన్స్ జార్జి

ఫస్ట్ లుక్: చిట్టి చెల్లెల్ని ముద్దాడుతున్న ప్రిన్స్ జార్జి

ఈ ఫోటోలన్నింటిని డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేట్ మిడిల్టన్ స్వయంగా తీయడం విశేషం. ప్రిన్స్ జార్చి, ప్రిన్సెస్ ఛార్లెట్ మొదటి ఫోటోను విడుదల చేయడం మాకెంతో సంతోషంగా ఉందని కెన్సింగ్టన్ ప్యాలెస్ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+