పరాయి దేశంలో భార్య మెలానియా చేతిలో ట్రంప్‌కు అవమానం
అమెరికా అధ్యక్షుడి స్థానంలో తొలిసారి విదేశీ పర్యటన చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు పరాయి దేశంలో ఆయన భార్య మెలానియా ట్రంప్ చేతిలో అవమానం ఎదురయింది. దీనికి సంబందించి వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి స్థానంలో తొలిసారి విదేశీ పర్యటన చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు పరాయి దేశంలో ఆయన భార్య మెలానియా ట్రంప్ చేతిలో అవమానం ఎదురయింది. దీనికి సంబందించి వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.
ఇటీవలే సౌదీ పర్యటన ముగించుకున్న ట్రంప్ దంపతులు.. సోమవారం ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక విమానం దిగిన ట్రంప్ దంపతులకు ఇజ్రాయెల్ అధికారులు కార్పెట్‌పై పరిచి ఘటన స్వాగతం పలికారు.

రెడ్ కార్పెట్‌పై నడుస్తూ వస్తున్నక్రమంలో ట్రంప్ తన భార్య మెలానియా చేయి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే మెలానియా ఆయన చేయిని తోసేసింది. ఈ చర్యతో బిత్తరపోయిన ట్రంప్.. ఆ ఘటనను కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు.
నలువైపుల నుంచి ట్రంప్‌ను చిత్రీకరిస్తున్న మీడియా సంస్థలు ఈ సంఘటనను గుర్తించాయి. అంతే ఇజ్రాయెల్‌లో అదే పెద్ద న్యూస్ అయింది. ఈ ఘటనను హైలెట్ చేస్తూ ప్రసారాలు చేశాయి. సోషల్ మీడియాలోను ఇది హల్ చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications