440 అడుగులు:సాహసం చెయ్యరా డింబకా(వీడియో)
లండన్: సాటి స్నేహితులతో కలిసి జల్సాగా తిరగవలసిన వయస్సులో అతను ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఎలాంటి రక్షణ లేకుండ ఏకంగా వందల అడుగుల బ్రిడ్జ్ ఎక్కేశాడు. ఒక్క సారి కాలు జారిదంటే ప్రాణాలు గాలిలోనే కలిసి పోతాయి.
జేమ్స్ కింగ్ స్టన్ (24) అనే యువకుడు లండన్ లోని వెంబ్లీ స్టేడియం మీద ఉన్న బ్రిడ్జ్ ఎక్కాడు. అయితే కనీసం అతను నడుముకు తాడు కూడా కట్టుకోలేదు. 440 అడుగుల బ్రిడ్జి ఎక్కి దాని మీద సర్కస్ చేశాడు. అది చాలదన్నట్లు అక్కడే మకాం వేసి లండన్ అందాలు తిలకించాడు.
చివరికి కొన్ని సెల్ఫీలు తీసుకుని ఎంజాయ్ చేశాడు. ఇతను బ్రిడ్జ్ ఎక్కుతున్న సమయంలో, అక్కడ నుండి కిందకు దిగుతున్న సమయంలో స్టేడియంలో ఉన్న ప్రజలు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అయితే అతను కిందకు వచ్చిన తరువాత మీరు ఇలాంటి సాహసాలు చెయ్యరాదని ఉచిత సలహాలు ఇచ్చాడు.












Click it and Unblock the Notifications