1839లోనే తొలి సెల్ఫీ, హాలీవుడ్ తారలా అనుకొని...
న్యూయార్క్/భోపాల్: 175 ఏళ్ల క్రితమే ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకున్నారు! ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు, ఫ్రంట్ కెమెరాలతో అందరు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువత సెల్ఫీల మోజులో బాగా పడింది. అయితే, సెల్ఫీ ఇటీవల వచ్చిందేమీ కాదట. ఇటీవల మొదటి సెల్ఫీ అంటూ ఒకటి వెలుగులోకి వచ్చింది.
అయితే, 175 సంవత్సరాల క్రితమే మొదటి సెల్ఫీ వచ్చిందట. అమెరికాలోని పిలడెల్ఫియాలో ఫోటో గ్రాఫర్ రాబర్ట్ కార్నెలియన్ 1839లో తన సెల్ఫీ తీసుకున్నాడు. అతను ముందుగా కెమెరాను సెట్ చేసుకొని దాని ముందుకు వచ్చి ఐదు నిమిషాల పాటు కదలకుండా నిలబడి ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటో వెనుక ఫస్ట్ లైట్ పిక్చర్ ఎవర్, 1839 అని రాసుకున్నాడు.

కన్స్యూమర్స్ కోర్టుకీడ్చింది
తనకు హాలీవుడ్ నటిలా హెయిర్ స్టైలింగ్ చేయలేదంటూ ఓ యువతి సెలూన్ సిబ్బందిని కన్స్యూమర్ కోర్టుకు లాగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరానికి చెందిన పంతొమ్మిదేళ్ల యువతి మెహక్ అగర్వాల్ హెయిర్ స్టైల్‌ను మార్చుకోవాలని భావించింది.
సిటీలో పేరున్న ఓ బ్యూటీ సెలూన్‌కు వెళ్లింది. తనకు హలీవుడ్ తార ఇవా మెండిస్‌లా హెయిర్ స్టైలింగ్ చేయాలని సూచించింది. తన శిరోజాల పొడవు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెయిర్ డ్రెస్సర్లకు పలుమార్లు చెప్పింది. ఏమాత్రం తేడా ఉండదంటూ హెయిర్ డ్రెస్సర్లు ఆమె జుట్టును కత్తిరించారు.
దీంతో, మెహక్ హెయిర్ డ్రెస్ ఇవా మెండిస్‌లా ఏమాత్రం కనిపించలేదు. అంతేకాగు, ఆమె భయంకరంగా తయారైంది. అద్దంలో చూసుకున్న మెహక్ ఒక్కసారిగా హెయిర్ డ్రెస్సర్ల పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సెలూన్ సిబ్బందిని కన్స్యూమర్స్ కోర్టుకు లాగింది.












Click it and Unblock the Notifications