వ్యభిచారం చేసిందని రాళ్లతో కొట్టి చంపారు (వీడియో)

న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపు మరో ఘోరానికి పాల్పడింది. సిరియాలోని హమాన్స్ ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ వ్యభిచారం చేసిందంటూ ఆమెను రాళ్లతో కొట్టి చంపిన వీడియోను ఆన్ లైన్‌లో పోస్ట్ చేశారు.

ఐదు నిమిషాల నిడవి ఉన్న ఈ వీడియోలో మహిళ తన తండ్రితో మాట్లాడుతూ కనిపిస్తుంది. తన తండ్రి పక్కనే ఓ ఐఎస్ఐఎస్ మిలిటెంట్ మాట్లాడుతూ కనిపిస్తాడు. ఈ వీడియోలో ఆమె తన తండ్రిని క్షమించమని అడిగినా అతను అందుకు నిరాకరిస్తాడు.

First Stoning in Hama; Woman Filmed Pleading for Forgiveness from 'Unmoved' Father

తన తండ్రే స్వయంగా ఆమెకు తాడు కట్టి ఒక గోతిలోకి దించుతాడు. ఆ తర్వాత ఆమెను రాళ్లతో కొడతారు. తన తండ్రే స్వయంగా తన కూతురుని రాళ్లతో కొట్టడమే కాకుండా ఇతరులకు కొట్టేందుకు రాళ్లను కూడా పోగు చేశాడు.

ఆ రాళ్ళతోనే ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు ఆమెను చనిపోయేదాకా కొట్టారు. ఆమె తన తండ్రిని క్షమించమని అడిగినా, అతడు నిరాకరించినట్టు వీడియోలో వెల్లడైంది. క్షమిస్తే ఆమె స్వర్గానికి చేరుకుంటుందని, క్షమించాలని మిలిటెంట్ చెప్పినా, ఆమె తండ్రి నిరాకరించాడు.

వీడియోని ఇక్కడ వీక్షించండి:

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/Aw9-0HVsC1Q?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+