Viral Video: రాక్షస చేపను చూశారా.. లేకుంటే ఈ వీడియోలో చూడండి..
మీరు రకరకాల చేపలను చూసుంటారు. కానీ రాక్షస చేపను చూశారా.. అదీ 16 అడుగుల రాక్షస చేప.. ప్రస్తుతం ఈ చేపను బయటకు తీసుకొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్తే చిలీలో ఇటీవల మత్స్యకారుల బృందం 16 అడుగుల పొడవైన రాక్షస చేపను పట్టుకుంది. స్థానికులు దీనిని సునామీలు, భూకంపాలకు "చెడు శకునము" అని పిలుస్తారు. అందుకే దీన్ని రాక్షస చేప అంటారు. అరికా నగరంలో పట్టుకున్న ఈ చేపను ఓర్ ఫిష్ అని కూడా అంటారటా.

ఎలా తప్పించుకోవాలి..
16 అడుగు పొడవున్న రాక్షస చేపను క్రేన్ సహాయంతో పైకి లాగుతున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. "అది భయంకరమైన అద్భుతమైన చేప." ఒకరు. "ఇప్పుడు మనం ఎక్కడ తప్పించుకోవాలి?" అని మరొకరు కామెంటే చేశారు. ఈ రాక్షస చేప లోతులలో నివసిస్తుందని ఇంకొకరు కామెంట్ చేశారు.
ప్రమాదకరం కాదు..
ఈ చేను చాలా కాలంగా రాబోయే సునామీలు, భూకంపాలకు శకునంగా భావిస్తారు. అయితే దీనికి కచ్చితమైన ఆధారాలు లేవు. ఓర్ ఫిష్ సాధారణంగా లోతైన నీటిలో నివసిస్తుంది. అవి అనారోగ్యంతో, చనిపోయే లేదా సంతానోత్పత్తి చేసినప్పుడు మాత్రమే ఉపరితలంపైకి వస్తాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, ఓర్ ఫిష్ ప్రజలకు ప్రమాదకరమైనవి కావు. ఓర్ ఫిష్ చిన్న పాచిని తింటాయి.

తుఫానుల వల్ల..
తుఫానులు లేదా బలమైన ప్రవాహాల వల్ల ఈ చేపలు ఉపరితలంపైకి నెట్టబడతారని శాస్త్రవేత్తలు భావిస్తారు. ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా చనిపోయే సమయంలో అవి అక్కడికి చేరుకుంటాయి.












Click it and Unblock the Notifications