భారత్ లోకి ప్రవేశించిన పాకిస్థానీ జాలర్లు.. BSF జవాన్లు ఏం చేశారంటే..?

ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఉగ్రమూకలు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. ఆ తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య అన్ని సంబంధాలు కట్ అయి పోయాయి.

ఈ క్రమంలో తాజాగా పాకిస్థాన్ నుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన నలుగురు జాలర్లను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ కచ్ జిల్లా రాన్ ఆఫ్ కచ్ తీరంలో భారత్- పాకిస్థాన్ బోర్డర్ కు సమీపంలోని సర్ క్రీక్ ఏరియా నుంచి ఈ పాకిస్థాన్ కు చెందిన జాలర్లు భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిని గుర్తించి బీఎస్ఎఫ్ జవాన్లు అరెస్ట్ చేశారు.

fishermen Incursion into Indian waters BSF arrests four Pakistani fishermen and seizes their boat

అలాగే వారి వద్ద ఉన్న ఫైబర్ ఫిషింగ్ బోట్ ను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ జాలర్లు భారత జలాల్లోకి ప్రవేశించారని నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తం అయ్యాయి. వెంటనే గస్తీ నిర్వహించి వారిని అరెస్ట్ చేశారు. ఇక అదుపులోకి తీసుకున్న జాలర్ల వివరాలు చూస్తే ఖాదిర్ తైమూర్, మహమ్మద్ ముస్సా, అజ్గర్ తైమూర్, అహషాక్ జత్ లుకా గుర్తించారు. వీళ్లంతా పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ కు చెందినవారుగా తేల్చారు. అయితే పడవకు సంబంధించిన ఇతర సమాచారం వెల్లడించలేదు. వారి ప్రవేశానికి సంబంధించిన పరిస్థితులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ జాలర్లు వేట కోసం భారత జలాల్లోకి ప్రవేశించారా..? లేక ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాల కోసం ప్రవేశించారా..? అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+