థ్యాంక్స్ మోడీ! గొప్పగా ఉన్నాయి: ‘మోడీ సూట్’లో దక్షిణకొరియా ప్రెసిడెంట్ మూన్ ఆనందం
న్యూఢిల్లీ/సియోల్: భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకు ఇచ్చిన కానుక ఎంతగానో నచ్చిందని, గొప్పగా ఉందని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఆ మంచి కానుక పంపించినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

మూన్ ఆనందం..
ఇంతకీ మూన్‌కి ప్రధాని మోడీ పంపించిన కానుక ఎంటో తెలుసా? అదే ‘మోడీ సూట్'. దీనినే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌కి మోడీ కానుకగా పంపించారు. ఆ దుస్తులు ధరించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్.. తన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు.
గొప్పగా ఉన్నాయి..
‘భారత ప్రధాని నరేంద్ర మోడీ నాకు కొన్ని అందమైన వస్త్రాలు పంపించారు. భారతీయ సాంప్రదాయ దుస్తులు అవి. మోడీ సూట్‌గా పేరొందినవి. అవి నాకు బాగా సరిపోయాయి. గొప్పగా ఉన్నాయి' అని దక్షిణ కొరియా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.
మోడీకి మూన్ కృతజ్ఞతలు..
‘నేను భారత్‌లో పర్యటించేందుకు వచ్చిన సమయంలో మోడీ ధరించిన దుస్తులు చాలా బాగున్నాయని చెప్పాను. అందుకే ఆయన నాకు ఇవి పంపించారు. ఆయన పంపించనవన్నీ నాకు సరిగ్గా సరిపోయాయి. నా కొలతల ప్రకారమే వీటిని కుట్టించి ఇచ్చారు. ఇంత మంచి వస్త్రాలు నాకు పంపించినందుకు మోడీకి కృతజ్ఞతలు' అని మూన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
‘మోడీ జాకెట్' పేరుతో వస్త్రాలు
మోడీ పంపించిన సూట్‌ల ఫొటోలను కూడా ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. కాగా, ఆ సూట్ మీద ‘మోడీ జాకెట్' అని రాసి ఉంది. ఇటీవల దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రధాని మోడీని సియోల్ శాంతి పురస్కారం-2018కి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించినందుకు మోడీని శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్లు పురస్కార కమిటీ ప్రకటించింది. తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మోడీ దక్షిణ కొరియాకు కృతజ్ఞతలు తెలిపారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications