గత ఇరవై ఏళ్లలో ఐదు ప్రాణాంతాక వైరస్ లను వదిలింది..!చైనా పై తీవ్రస్తాయిలో మండిపడ్డ ట్రంప్..!
వాషింగ్టన్/హైదరాబాద్ : చైనా దేశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి డోస్ పెంచి కనికరంలేని పచ్చి ఆరోపణలు చేసారు అగ్రరాజ్యం అద్యక్షుడు. కరోనా వైరస్ వల్ల వస్తున్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న చైనా, తాజాగా ట్రంప్ చేసిన వాఖ్యలతో ఖంగుతిన్నంత పనయ్యింది. ట్రంప్ తాజా వ్యాఖ్యల పట్ల సభ్య దేశాలు కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
Recommended Video
ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ ను పరిచయం చేసిన చైనా గడిచిన ఇరవైఏళ్లలో ఐదు ప్రాణాంతాక వైరస్ లను ప్రపంచ మీద ప్రయోగించిందని, ఇక ఎలాగైనా చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో ప్రపంచ దేశాలు అసలు చైనా, అమెరికా మద్య ఏంజరుగతుందని ఆసక్తికరంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది.

చైనా దేశపు నిర్వాకం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు సర్వనాశనం కావడంతో పాటు లక్షలమంది ప్రాణాలు పోయారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియాన్ ఘాటుగా విమర్శించారు. కొవిడ్-19 వైరస్ చైనా దేశంలోని వుహాన్ నుంచే వచ్చిందనడానికి నిర్ధిష్టమైన ఆధారాలున్నాయన్నారు. చైనా దేశం రకరకాల వ్యాధులను ప్రపంచం మీద ప్రయోగిస్తుంటే ప్రజలు సహించే పరిస్థితులు లేవని హెచ్చరించారు.
20 సంవత్సరాల వ్యవధిలో సార్స్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, జికా వైరస్ తో పాటు తాజాగా కొవిడ్-19 వంటి ఐదు అంటువ్యాధులు చైనా ప్రపంచానికి అంటించిందని మండిపడ్డారు. అది ఎంతో బాధ్యతారాహిత్యమని రాబర్ట్ ధ్వజమెత్తారు. అందుకే చైనాను కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం పావులు కదుపుతోంది. అమెరికన్ కాంగ్రెస్‌లో ఇందుకు సంబంధించి కీలక బిల్లు కూడా ప్రవేశ పెట్టింది. కరోనా వ్యాప్తికి సంబంధించిన వివరాలను అందించేందుకు చైనా దేశం సహకరించని పక్షంలో కఠిన ఆంక్షలు విధించేదిశగా అడుగులేస్తోంది ట్రంప్ ప్రభుత్వం.
-
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఖమేనీ సంధి ఒప్పందం? -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..!












Click it and Unblock the Notifications