దారుణం: క్రికెట్ ఆడుకుంటున్న యువకుల కాల్చివేత

ఈ కాల్పుల్లో ఐదుగురు యువకులు అక్కడికి అక్కడే మృతి చెందారు. ఐదుగురు యువకులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఇది తాలిబన్ల పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిని అధ్యక్షులు హమీద్ కర్జాయ్ తీవ్రంగా ఖండించారు.
మోటారు సైకిల్ పైన ఒక్కడే వ్యక్తి వచ్చి యువకులను కాల్చినట్లుగా ఆఫ్ఘన్ అధికారులు చెబుతున్నారు. కాల్పులు జరిపిన వెంటనే అతను పారిపోయారని చెబుతున్నారు.
మరోవైపు, రెండు రోజుల క్రితం ఇలాగే మోటారు సైకిల్ పైన వచ్చిన వ్యక్తులు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పైన కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు మృతి చెందారు.












Click it and Unblock the Notifications