ఐదేళ్ల బాలుడి మీద రేప్ కేసు నమోదు

ఇంగ్లాండ్: ఐదేళ్ల బాలుడి మీద రేప్ కేసు నమోదు అయ్యింది. అత్యాచార ఆరోపణలపై గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు పదేళ్ల లోపు చిన్నారుల మీద అత్యాచార కేసులు పెరిగిపోతుండటంతో ఇంగ్లాండ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

గత సంవత్సరం నుంచి (ఏడాది కాలంలో) 21 రేప్ కేసులు, 70 లైంగిక వేధింపుల కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇంగ్లాండ్ చట్టాల ప్రకారం 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలని ప్రాసిక్యూట్ చేసే అవకాశం లేదని పోలీసు అధికారులు అన్నారు.

 Five-years-old boy investigated for rape case in Manchester

ఇంగ్లాండ్, వేల్స్ లో చిన్నారులపై వివిధ నేరాల కింద ఇప్పటి వరకు 4,584 కేసులు నమోదు అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. చిన్నారుల మీద ఇన్ని కేసులు నమోదు అయిన విషయం నిజమేనని ఇంగ్లాండ్ కు చెందిన డైలీ స్టార్ మీడియా వెల్లడించింది. చిన్నారుల మీద కేసులు ఎక్కువ అయ్యాయి.

తీవ్రంగా గాయపరిచాడనే ఆరోపణలతో రెండున్నరేళ్ల చిన్నారి మీద కేసు నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. చిన్నారుల ఆగడాలు ఎక్కువ కావడంతో తాము పోలీసులను ఆశ్రయిస్తున్నామని బాధితులు అంటున్నారు. అయితే పోలీసు అధికారుల దర్యాప్తులో నిజానిజాలు వెలుగు చూడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+