వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెల్బోర్న్ లో ఐదుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అరెస్టు

|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్: ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ సైనికుల దినోత్సవం రోజు విధ్వంసాలు స్పృష్టించడానికి ప్రయత్నించిన ఐదుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల మద్దతుదారులను అరెస్టు చేశారు. ఐదు మంది ఉగ్రవాదులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని శనివారం ఆస్త్రేలియా ప్రధాన మంత్రి టోని అబ్బోట్ స్పష్టం చేశారు.

వచ్చ వారంలో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ సైనికుల దినోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు పెద్ద ఎత్తున పోలీసులు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ కార్యక్రమంలో దాడులు చేసి విధ్వంసాలు స్పృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఇంటిలి జెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

Five young men were arrested Saturday in Melbourne

గత నెల రోజుల నుండి 200 మంది పోలీసు అధికారులు, సిబ్బంది తిండితిప్పలు వదిలేసి 24 గంటలు ఉగ్రవాదుల కొసం గాలించారు. శనివారం వేకువ జామున మెల్బోర్న్ నగరంలో ఐదు మందిని అరెస్టు చేశారు. వారి నుండి అత్యాధునిక ఆయుధాలు, బాంబులు స్వాదీనం చేసుకున్నారు.

అరెస్టు అయిన ఐదుగురు 18 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్న వారే అని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ యాక్టింగ్ డిప్యూటి కమిషనర్ నీల్ గౌగర్ అన్నారు. వీరు ఐదుగురు ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల కార్యాకలాపాల ఆకర్షణకు గురైనారని చెప్పారు. అందుకే దాడులు చెయ్యడానికి ప్రయత్నించారని, న్యాయమూర్తి అనుమతితో అందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు.

English summary
Two suspects were charged with terrorism-related offenses in Melbourne, said Australian Federal Police Acting Deputy Commissioner Neil Gaughan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X