సూర్యుడు వస్తే చాలు.. ఆ హోటల్లో చికెన్ కర్రీ రెడీ అయినట్టే! (వీడియో)
థాయిలాండ్‌లోని ఫెట్చబురి పట్టణానికి చెందిన సిలా సుథారత్ స్థానికంగా చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. 20 ఏళ్లుగా సూర్యకాంతిని వినియోగిస్తూ చికెన్‌ను కాల్చుతూ అందర్ని ఆకర్షిస్తున్నాడు.
బ్యాంకాక్: సూర్యరశ్మి వల్ల మనకు ఉపయోగాలేమిటి? పగటిపూట వెలుతురు, శరీరానికి డి-విటమిన్, సౌర విద్యుత్తు, ఎండలో బట్టలు.. వడియాలు ఆరబెట్టుకోవచ్చు. కానీ.. ఎండతో వంట చేసుకోవచ్చా!?
వేసవికాలంలో ఎండలు మండుతున్నప్పుడు అపుడప్పుడు రోడ్డుపై కోడిగుడ్లు పగలగొట్టి ఆమ్లెట్ వేసి ఎండ తీవ్రత ఎలా ఉందో సరదాగా చూపిస్తుంటారు. కానీ.. నిజంగానే ఓ వ్యక్తి కేవలం ఎండ సాయంతో చికెన్‌ను కాల్చుతూ నోరూరించే వంటకం తయారు చేస్తున్నాడు.
థాయిలాండ్‌లోని ఫెట్చబురి పట్టణానికి చెందిన సిలా సుథారత్(60) అనే వ్యక్తి స్థానికంగా చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. 20 ఏళ్లుగా సిలా సూర్యకాంతిని వినియోగిస్తూ చికెన్‌ను కాల్చుతూ అందర్ని ఆకర్షిస్తున్నాడు.
మొదట్లో అతను చికెన్‌ను బొగ్గుల మంటపై కాల్చేవాడు. 1997లో ఒకసారి రోడ్డుపై నుంచి వెళ్తున్న బస్ అద్దాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెంది సిలాపై పడిందట. అది చాలా వేడిగా ఉండటం గమనించిన సిలా ఎండతోనే వంట చేయాలని నిర్ణయించుకున్నాడు.
దీనికోసం వెయ్యి చిన్న చిన్న అద్దాలతో ఒక తెరను నిర్మించాడు. దాన్ని సూర్యుడికి అభిముఖంగా పెట్టడంతో సూర్యకాంతి ఆ అద్దాలపై పడి పరావర్తనం చెంది అధిక ఉష్ణోగ్రతతో కాంతులను మళ్లిస్తుంది. ఆ కాంతుల్ని సిలా చికెన్ కాల్చడానికి వినియోగిస్తున్నాడు.
మొదట సిలా చేసిన ప్రయత్నాలు చూసి అందరూ నవ్వుకున్నారు. ఎండతో వంట చేయడం అసాధ్యమన్నారు. కానీ.. తను రూపొందించిన తెరతో కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో 1.5 కేజీల చికెన్ తయారు అవుతుండటం చూసి నవ్వుకున్నవాళ్లే ఆశ్చర్యపోయారు.
సిలా ఏర్పాటు చేసిన అద్దాల తెర ద్వారా వచ్చే ఎండ 312 డిగ్రీలు ఉంటుందట. ఇలా ఎండతో చేసిన చికెన్ రుచి చూడటానికి అనేక మంది సిలా హోటల్ ముందు క్యూ కడుతున్నారు. దీంతో ఆయన వ్యాపారం బాగా సాగుతోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications