రియాల్టీ షోలో షాక్: మెడలోకి దూసుకెళ్లిన బాణం(వీడియో)
లాస్‌ఏంజిల్స్: రియాల్టీ షోలు అంటేనే ఒళ్లు గగుర్పొడిచే సాహసాలకు మారుపేరుగా నిలుస్తున్నాయి. అయితే, అప్పుడప్పుడు ఇలాంటి షోలలో కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్నప్పటికీ వాటి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా, అమెరికాలో జరిగిన ఓ రియాల్టీ షోలో కూడా అపశృతి చోటుచేసుకుంది.
లైవ్‌లో అందరూ చూస్తుండగానే స్టంట్ చేస్తుండగా పొరపాటుగా నిప్పుల బాణం అవతలి వ్యక్తి మెడలోకి దూసుకెళ్లింది. ఎన్‌బీసీ ఛానల్‌లో ప్రసారమయ్యే 'అమెరికాస్ గాట్ టాలెంట్' షోలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
అదృష్టవశాత్తూ బాణం తగిలిన వ్యక్తికి పెద్దగా ప్రమాదం జరగలేదు. కత్తులను గొంతులోకి దింపుకోగల నైపుణ్యం ఉన్న రేయాన్ స్టాక్ అనే వ్యక్తికి ఈ రియాల్టీ షోలో బాణం తగలగా తర్వాత తాను బాగానే ఉన్నానని ప్రమాదమేమీ లేదని వెల్లడించారు.












Click it and Unblock the Notifications