కీవ్ సిటీ ఆకాశంలో భారీ కాంతి పుంజం: ఉలిక్కిపడ్డ ఉక్రెయిన్ ప్రజలు (వీడియో)

కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రజలను ఓ భారీ కాంతి పుంజం భయాందోళనలకు గురిచేసింది. రష్యా దాడులు కొనసాగుతున్న వేళ ఈ ఘటన ప్రజల్లో మరోసారి ఆందోళన రేకెత్తించింది. మొదట ఈ భారీ కాంతి పుంజం.. వైమానికి దాడి అయి ఉండొచ్చని పలువురు భయాందోళనలకు గురయ్యారు. అయితే, నాసా(NASA)కు చెందిన ఉపగ్రహం భూ వాతావరణంలోకి ప్రవేశించడం వల్లే ఈ కాంతి పుంజం(Flash light) ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

'కీవ్ గగనతలంలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. వైమానిక దాడి జరుగుతుందేమోనని హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు గగనతలన రక్షణ వ్యవస్థ పనిచేయడం లేదు. కానీ, ఆ వెలుగు నాసాకు చెందిన ఉపగ్రహం భూమిపై కూలిపోయే సమయంలో వచ్చిందని వాయుసేన తెలిపింది' అని కీవ్ సైనిక పరిపాలన అధికారి ఒకరు వెల్లడించారు.

Ukraines Kyiv Sparks Anxiety Amid War

బుధవారం రాత్రి 10 గంటల సమయంలో కాంతి పుంజం దర్శనమిచ్చింది.
ఈ దృశ్యాలను పలు ఛానళ్లు ప్రసారం చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మీమ్స్‌లో వైమానిక దళం గుర్తులను వినియోగించకూడదని వాయుసేన హెచ్చరికలు జారీ చేసింది.

కాగా, కాలం చెల్లిన ఓ ఉపగ్రహం బుధవారం భూ వాతావరణంలోకి ప్రవేశించనుందని నాసా వారం క్రితమే వెల్లడించింది. ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించగానే కాలిపోతుందని పేర్కొంది. కొన్ని భాగాలు మాత్రం వాతావరణ ఘర్షణను తట్టుకోగలవని.. అయితే భూమిపై ఎవరికీ ప్రమాదం లేదని నాసా స్పష్టం చేసింది.

సౌర మంటలను పరిశీలించడానికి ఉపయోగించే RHESSI అంతరిక్ష నౌకను 2002లో తక్కువ భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టి, 2018లో ఉపసంహరించుకున్నట్లు నాసా తెలిపింది. కాగా, రష్యా దాడులతో ఇప్పటికే ఉక్రెయిన్ దేశంలోని చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తమ నివాసాలను విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కాంతిపుంజం రావడం మరోసారి ఉక్రెయిన్ ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+