విలాసాల అడ్డా దుబాయ్ లో సముద్రం నీటిలో విల్లాలు

దుబాయ్: దుబాయ్ లో మరో అట్రాక్ష్క్షన్ సిద్దమవుతోంది. సముద్రంలో కళ్లు చెదిరే నీటిపై తేలియాడే విల్లాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచపటం ఆకారాల్లో దీవులు, వాటిపై ఇళ్లు నిర్మించారు.

అదే విధంగా సముద్రంపై ఈత చెట్లు నిర్మించి వాటి మీద ఇళ్లు కట్టేశారు. ఈ ఎడారి దేశంలో తాజాగా సముద్రం నీటిపై తేలియాడే విల్లాలు నిర్మిస్తున్నారు.

డచ్ ఆర్కిటెక్చర్ సంస్థ 'న్యూ లివింగ్ఆన్ వాటర్' పేరుతో నీటిలో తేలియాడే విలాసవంతమైన ఫ్లోటింగ్ విల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

Floating Seahorse villa with underwater bedrooms in Dubai

కోడిగుడ్డు ఆకారంలో 164 అడుగుల పొడవు, 98 అడుగుల వెడల్పు ఉండే ఒక్కో విల్లా మూడు అంతస్తులు ఉంటుంది. బేస్ మెంట్ మొత్తం కాంక్రీట్ తో నిర్మిస్తున్నారు.

కాంక్రీట్ గదులలో సగభాగం నిండితే మిగిలిన సగాన్ని ఇంటిని నిలకడగా ఉంచేందుకు వాడుతారు. గ్రౌండ్ ఫ్లోర్ లో అధునాతనమైన నాలుగు బెడ్ రూమ్ లు, లివింగ్ రూమ్, కిచెన్ ఉంటుంది.

ప్రతి బెడ్ రూమ్ కు ప్రత్యేకంగా ఔట్ డోర్ ప్యూ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మొదటి అంతస్తులో లివింగ్ రూమ్ , చిన్న సైజులో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకోవచ్చు.

సముద్రపు నీటితోనే గదులను చల్లబరిచేందుకు లేదా వెచ్చగా ఉంచేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. వినియోగదారులు కోరితే వీటికి సోలార్ ప్యానెల్స్ బిగించుకోవచ్చని సంస్థ నిర్వహకులు చెప్పారు.

అలాగే విల్లాకు ఎక్కడికక్కడ నీటిని శుద్ది చేసే యంత్రాలు ఏర్పాటు చేస్తామని న్యూ లివింగ్ ఆన్ వాటర్ సంస్థ తెలిపింది. వచ్చే నెల 6వ తేదిన దుబాయ్ లో మొదలు కానున్న సిటీ స్కేప్ గ్లోబ్ ప్రదర్శనలో నమూనా ఇంటిని ప్రదర్శిస్తారు.

దాదాపు 16 వేల చదరపు అడుగుల వైశాల్యం ఉండే అలల్లాంటి ఒక్కోవిల్లా ఖరీదు దాదాపు రూ. 70 కోట్లు ఉంటుందని సంస్థ నిర్వహకులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+