వార్నీ.. ఇతగాడు క్వారంటైన్‌ కోసం ఏ స్థలం చూసుకున్నాడో తెలిస్తే అవాక్కవుతారు..!

ఒర్లాండో: కరోనావైరస్ ప్రపంచాన్ని కబళిస్తోంది. చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరైతే హోంక్వారంటైన్‌లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే క్వారన్‌టైన్‌ పేరుతో అమెరికాలో ఓ వ్యక్తి వ్యవహారం చూస్తే షాక్ విస్తుపోయేలా ఉంది. ఇంతకీ ఎవరా వ్యక్తి ఏమా కథ తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.

ఫ్లోరిడాలో రిచర్డ్ మెక్ గైర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. డిస్నీకి చెందిన డిస్కవరీ లాండ్‌లో ఆ వ్యక్తిని పోలీసులు చేశారు. ఇంతకీ ఆ వ్యక్తిని ఎందుకు అరెస్టు చేశారో తెలిస్తే నోళ్లెల్లబెట్టాల్సిందే. క్వారంటైన్‌లో ఆ వ్యక్తి అక్కడున్నందుకు అరెస్టు చేశారు. ఇదేంటి క్వారంటైన్‌లో ఉన్న రిచర్డ్‌ను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు అనే అనుమానం రావొచ్చు. కానీ ఇది నిజం. అయితే రిచర్డ్ డిస్నీలాండ్‌లో సోమవారం నుంచి ఉన్నాడట. డిస్నీ లాండ్‌ గత కొద్ది రోజులుగా మూసివేసి ఉంది. అయితే రిచర్డ్ అక్కడికి ఎలా వెళ్లాడనేది సస్పెన్స్‌గా మారింది. మరోవారం రోజుల పాటు అక్కడే ఉండాలని తాను ఫిక్స్ అయినట్లు రిచర్డ్ పోలీసులకు తెలిపాడు.

Florida man arrested by police for trying to quarantine on Diney island

గత కొద్ది రోజులుగా డిస్నీలాండ్‌ను పోలీసులు జల్లెడ పడుతున్నారు. పలుమార్లు పోలీసులు మైకులతో ప్రకటనలు కూడా చేస్తున్నారు. అలాంటప్పుడు రిచర్డ్ లోపల ఎలాగున్నాడని పోలీసులు ప్రశ్నించగా అతని సమాధానంతో వారు అవాక్కయ్యారు. తాను డిస్నీల్యాండ్‌లో ఉన్న ఓ భవంతిలో పడుకున్నట్లు చెప్పాడు. తనకు పోలీసుల మైకుల్లో చేస్తున్న ప్రకటనలు వినపడలేదని వెల్లడించాడు.

అంతేకాదు డిస్నీలాండ్‌లో ఆంక్షలు విధించారన్న సంగతి తనకు తెలియదని పోలీసులతో రిచర్డ్ చెప్పాడు. వాస్తవానికి అడుగు అడుగుకు నో ట్రెస్‌పాసింగ్ అనే బోర్డును ఉంచారు. అంతేకాదు అక్కడ ఉండటం తాను ఉష్ణమండలంలో స్వర్గంలా ఫీలైనట్లు పోలీసులకు చెప్పాడు. మొత్తానికి రిచర్డ్ నాలుగురోజుల పాటు పోలీసుల కళ్లు కప్పి మూసిఉన్న డిస్నీల్యాండ్‌లోకి చొరబడ్డాడన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+