ఫ్లోరిడా కాల్పులు: నిందితుడి వద్ద 10వెపన్స్, ' పిల్లలను స్కూళ్లకు పంపిస్తే మళ్లీ చూడగలమా?'
ఫ్లోరిడా: అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్.. ఇటీవల 17మంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. టీనేజర్లకు సైతం గన్స్ సులువుగా అందుబాటులోకి వస్తుండటంపై ఇప్పుడక్క పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్ కాల్పుల నిందితుడు నికోలస్ క్రూజ్ వెపన్ బ్యాక్ గ్రౌండ్ బయటకు తీస్తున్నాయి దర్యాప్తు సంస్థలు.

నికోలస్ వద్ద 10 వెపన్స్:
అమెరికన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఒకరు నికోలస్ క్రూజ్ వద్ద ఉన్న ఆయుధాల గురించి స్పందించారు. నికోలస్ వద్ద కనీసం 10 వెపన్స్ ఉన్నాయని, దాదాపుగా అన్నీ రైఫిల్సే అని చెప్పారు. నికోలస్ వాటన్నింటిని ఎక్కడినుంచి కొనుగోలు చేశాడో పోలీసులు కూపీ లాగుతున్నారని అన్నారు.

ఆ షాపులో ఒక గన్ కొనుగోలు..:
సౌత్ ఫ్లోరిడాలోని ఒక గన్ వరల్డ్ నుంచి నికోలస్ ఒక వెపన్ కొనుగోలు చేసినట్టు ఆ స్టోర్ సీఈవో కిమ్ వాల్టచ్ తెలిపారు. అయితే అతను ఏ రకం గన్ కొనుగోలు చేశాడన్నది మాత్రం ఆమె చెప్పలేదు. అయితే నిబంధనల ప్రకారమే తాము వెపన్ విక్రయించామని తెలిపారు.

కోలుకుంటున్న 'ఆంటోనీ బోర్జెస్'..:
నికోలస్ క్రూజ్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డ 15ఏళ్ల ఆంటోని బోర్జెస్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. పార్క్ లాండ్‌లో నికోసల్ క్రూజ్ నరమేధంలో తీవ్రంగా గాయపడ్డవారిలో ఆంటోని ఒకరు. అతనితో పాటు మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడి ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆంటోనిని నికోలస్ ఐదుసార్లు షూట్ చేశాడని, అందువల్లే అతను తీవ్రంగా గాయపడ్డాడని బ్రోవార్డ్ కౌంటీ షెరీఫ్ తెలిపారు.

మార్పు కోసం ఆందోళనలు..:
అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్ పై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, యువత సోషల్ మీడియా వేదికగా తమ గొంతు విప్పుతున్నారు. లాస్ ఏంజిల్స్ లోని డెల్ రే బీచ్ వద్ద స్థానికులు ఓ పెద్ద ర్యాలీ కూడా నిర్వహించారు. 'అలాంటివారిని అవతలికి విసిరేయండి' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

'మళ్లీ చూస్తామో లేదో..':
స్టోన్‌మన్ డగ్లస్ ఆలమ్, చికాగో క్లబ్ ఫస్ట్ బేస్‌మాన్ ఆంటో రిజ్జో ఘటనపై స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన అనంతరం ఆయన ఓ సమావేశంలో మాట్లాడారు.
'తమ పిల్లలను స్కూళ్లకు పంపిస్తున్న ఏ తల్లిదండ్రులకు ఇప్పుడు భరోసా లేదు. తిరిగి వాళ్లను మళ్లీ చూస్తామో లేదో అన్న భయం తప్ప' అని ఆయన వ్యాఖ్యానించారు. మార్పు కోసం అందరూ ప్రయత్నించాలన్నారు.












Click it and Unblock the Notifications