6గురు మనవళ్లు, కూతుర్నీ కాల్చి చంపాడు: తనూ..

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కన్న కూతురుతోపాటు ఆరుగురు మనవళ్లను కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. డాన్ ఛార్లెస్ స్పిరిట్(51) అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఏడుగురిని తుపాకితో కాల్చి చంపాడు.

ఆ తర్వాత అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ఆత్మహత్య చేసుకునే ముందే అత్యవసర సేవల విభాగానికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకునేసరికి డాన్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు.

Florida shooting: man kills six grandchildren and daughter in murder-suicide

ఆ ఇంట్లో ఎనిమిది మంది మృతదేహాలు రక్తపు మడుగులో ఉన్నాయి. హత్య గావింపబడిన పిల్లలందరూ మూడు నెలల చిన్నారితో మొదులుకొని పదేళ్ల లోపు వారే. డాన్ ఛార్లెస్ మనవళ్లను, కూతుర్నీ చంపడానికి గల కారణాలు తెలియలేదు.

కాగా, డాన్ స్పిరిట్ తన ఎనిమిదేళ్ల కొడుకును 2001లో కాల్చి చంపినట్లు స్థానికులు చెప్పారు. ఈ నేరానికి జైలుకు వెళ్లిన డాన్ 2006లో విడుదలయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+