ఫ్లోరిడాలోని మియామిలో కూలిన బ్రిడ్జ్, పలువురి మృతి
మియామి: అమెరికాలో ఓ బ్రిడ్జి కూలి ఒకరు మృతి చెందారు. సమాచారం మేరకు పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
ఫ్లోరిడాలోని మియామి వద్ద ఈ బ్రిడ్జి కూలింది. పలువురికి గాయాలయ్యాయి. ఎనిమిది మందిని ఆసుపత్రికి తరలించారు. బ్రిడ్జి కింద పలు వాహనాలు చిక్కుకున్నాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ఈ బ్రిడ్జి ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వద్ద ఉంది. సిక్స్ లైన్ హైవే ఏరియా కావడంతో ట్రాఫిక్ నిలిచింది. కూలిన సమయంలో బ్రిడ్జి కింద ఎనిమిది కార్లు చిక్కుకుపోయాయి. ఈ ఘటన ఫ్లోరిడా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు చోటు చేసుకుంది.
#Florida : Several killed after new pedestrian bridge collapses
— ANI Digital (@ani_digital) March 15, 2018
Read @ANI Story | https://t.co/MPJzyJx7Ul pic.twitter.com/UNEaJcuceS












Click it and Unblock the Notifications