రాక్షసులు చెప్పారని ప్రియురాలిని చంపాడట!

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేయసిని విచక్షణా రహితంగా కొట్టిచంపాడు ఓ యువకుడు. అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడు చెప్పిన విషయాలు విని దిగ్ర్భ్రాంతికి గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. తన ప్రియురాలిని చంపిన మార్కో పెరేజ్(25) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని విచారించగా.. ఇద్దరు రాక్షసులు తనతో ఈ పని చేయించారని అతడు పోలీసులతో చెప్పాడు. ఫ్లోరిడాకు చెందిన మార్కో పెరేజ్ అతడి ప్రేయసి ఇడెల్సిరా పెరేజ్(25)తో ఓ విషయంపై వాదనకు దిగాడు.

Florida youth killed his girlfriend

ఆ వాదన ముదిరి వివాదంగా మారడంతో కోపోద్రిక్తుడై విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. ప్రియుడి దాడిలో ఆ యువతి స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. ఆమె మృతి చెందిన విషయం గ్రహించిన మార్కో ఆమె మృతదేహాన్ని ఇంటి పక్కనున్న పొదల్లో ఆకులు, చెక్కలు వేసి దాచేశాడు.

అనంతరం అతడే పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మార్కోను విచారించగా ఇద్దరు ఆగంతకులు తుపాకులతో తమ ఇంటికి వచ్చారని, తన ప్రేయసిని కొట్టి చంపాలని తనపై ఒత్తడి తెచ్చారని మార్క్ తెలిపాడు.

అంతేకాకుండా ఆ వచ్చినవారిద్దరూ రాక్షసులని, అందుకే వాళ్లు ఏం చెబితే అది చేశానని పోలీసులకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మార్కోపై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+