పాక్ ఫోక్ సింగర్ రేష్మ కన్నుమూత, నెలనుండి కోమాలో

Folk singer Reshma died
ఇస్లామాబాద్: ప్రముఖ పాకిస్తాన్ ఫోక్ సింగర్ రేష్మ ఆదివారం ఉదయం మృతి చెందారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమెను లాహోర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం కన్ను మూశారు.

ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గత కొద్ది రోజులుగా రేష్మా కోమాలో ఉన్నారు. రేష్మ 1947లో రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్‌లో ఓ బంజారా కుటుంబంలో జన్మించారు.

కొన్నాళ్లకు ఆమె కరాచీలో స్థిర పడింది. రేష్మకి ఓ కోడుకు, ఓ కూతురు ఉన్నారు. రేష్మ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్లు జియో టివిలో వార్తలు వచ్చాయి.

రేష్మకు పన్నెండేళ్లు ఉన్నప్పుడు షహబాజ్ కలందర్ విగ్రహం వద్ద పాడిన పాట విన్న ఓ టెలివిజన్, రేడియో నిర్మాత ఆమెకు లాల్ మేరీతో అవకాశమిచ్చారు. అది సూపర్ హిట్ అయింది. రేష్మ పాకిస్తాన్‌లో ప్రముఖ ఫోక్ సింగర్లలో ఒకరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+