గర్ల్ ప్రెండ్ కోసం పాటపాడిన పుట్‌బాల్ లెజెండ్
న్యూఢిల్లీ: పుట్‌బాల్ లెజెండ్ డియెగో మారడోనా సింగర్‌గా అవతారం ఎత్తాడు. తన ప్రేయసి రోకియా ఒలివ కోసం తన గొంతును సవరించుకున్నాడు. వివరాల్లోకి వెళితే దుబాయ్‌లో తన ప్రేయసికి చెందిన ఓ ఉత్పత్తి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న డియెగో మారడోనా పాట పాడి అభిమానులను అలరించాడు.

డియెగో మారడోనా స్పానిష్‌లో పాటను పాడాడు. ఇంగ్లీషులో దాని అర్ధం "నాకు నువ్వు కావాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అంటూ అభిమానులకు తెలియజేశాడు. పాట పాడిన తర్వాత తన ప్రేయసిని స్టేజిపైనే ముద్దు పెట్టుకున్నాడు.
54 ఏళ్ల డియెగో మారడోనా తనదైన శైలిలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. రెండు వారాల క్రితం డిగో మారడోనా తన ప్రేయసిని నెట్టివేసినట్లుగా, చేయి చేసుకున్నట్లుగా ఉన్న ఈ వీడియో అందర్నీ షాకింగ్‌కు గురి చేస్తోంది!
ఇందులో ఇరవై నాలుగేళ్ల తన మాజీ ప్రేయసి రొకియో ఒవిలియోను పలుమార్లు డిగో మారడోనా చేయి చేసుకున్నాడు.
తన పైన అతను చేయి చేసుకుంటున్న సమయంలో.. ఆగమని ప్రియురాలు పలుమార్లు మొరపెట్టుకుంది. అదే సమయంలో దీనిని ఆమె రహస్యంగా తన మొబైల్ ఫోన్లో వీడియా తీసింది. అయితే, తాను ఎప్పుడు కూడా చేయి చేసుకోలేదని మారడోనా చెప్పినట్లుగా తెలుస్తోంది.
గతంలో అర్జెంటీనా పుట్‌బాల్ జట్టులో డియెగో మారడోనా ప్రధాన భూమికను పోషించాడు. తన హాయంలో అద్భుతంగా రాణించి రెండో వరల్డ్ కప్ అందించాడు. మెక్సికో సిటీలో జరిగిన ఫైనల్స్‌లో అర్జెంటీనా జర్మనీని ఓడించి 1978 అనంతరం రెండోసారి విశ్వ విజేతగా ఆవిర్భవించింది.












Click it and Unblock the Notifications